ఆ మంత్రిని బొత్స బుట్ట‌లో వేసుకున్నారా...?

February 25, 2020

ఉత్త‌రాంధ్ర జిల్లా అయిన విజ‌య‌న‌గ‌రంలో అధికార పార్టీ రాజ‌కీయాలు ఆస‌క్తిగా మారాయి. ఈ జిల్లాలో వైసీ పీ క్లీన్ స్వీప్ చేసింది. అశోక్ గ‌జ‌ప‌తిరాజు స‌హా టీడీపీ సీనియ‌ర్ల‌ను సైతం వైసీపీ మ‌ట్టి క‌రిపించి ఇక్క‌డ గె లుపు గుర్రం ఎక్కింది. ఇక‌, ఈ వైసీపీ విజ‌యం అనేది కీల‌క మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ కేంద్రంగా జ‌రి గింద‌ని, ఆయ‌న వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రించ‌బ‌ట్టే ఇక్క‌డ పార్టీ విజ‌యం సాధించింద‌నే ప్ర‌చారం ఇప్ప‌టి కీ పార్టీలో ఉంది. జ‌గ‌న్ పాద‌యాత్ర‌కు తోడు బొత్స కూడా ఇక్క‌డ ప్ర‌తి గ్రామంలోనూ ప‌ర్య‌టించార‌ని, ఆ యన కీల‌కంగా వ్య‌వ‌హ‌రించ‌డం వ‌ల్లే.. పార్టీ ఇక్క‌డ ఘ‌న విజ‌యం సాధించ‌నే ప్ర‌చారం ఉంది. జిల్లాలో 9 అసెంబ్లీ సీట్ల‌తో పాటు విజ‌య‌న‌గ‌రం ఎంపీ సీటు సైతం వైసీపీ ఖాతాలోనే ప‌డ్డాయి.
ఈ నేప‌థ్యంలో పైకి సౌమ్యంగా ఉన్న‌ప్ప‌టికీ జిల్లాలో మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ హ‌వా మాత్రం జోరుగా సాగుతోంది. మంత్రి వ‌ర్గంలోనూ ఆయ‌న కీల‌కంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. రాజ‌ధాని అమ‌రావ‌తిపై మాట్లాడే మంత్రిగా ఆయ‌న ఒక్క‌రే క‌నిపిస్తున్నారు. అలాంటి బొత్స వ్య‌వ‌హార శైలిని ఓ కంట క‌నిపెట్టేందుకు, విజ యన‌గ‌రం జిల్లాలో పార్టీని బ‌తికించేందుకు వైసీపీ అధినేత జ‌గ‌న్ ఇక్క‌డ ఇంచార్జ్ మంత్రిగా వెలంప‌ల్లి శ్రీనివాస్‌ను నియ‌మించారు. సాధార‌ణంగా ఇంచార్జ్ మంత్రికి స‌ద‌రు జిల్లాపై పూర్తి ప‌ట్టు ఉంటుంది... ఉండాలి కూడా.... మం త్రులు, జిల్లాలోని ఎమ్మెల్యేలు కూడా ఇంచార్జ్ మంత్రికి పూర్తిగా స‌హ‌క‌రించ‌డం.... ఆయ‌న ఆదేశాల‌ను అమ‌లు చేయ‌డం అనేది కూడా స‌హ‌జం.
అయితే, విజ‌య‌న‌గ‌రంలో ఇంచార్జ్ మంత్రిగా ఉన్న వెలంప‌ల్లికి మాత్రం సీన్ రివ‌ర్స్ అయింద‌ని అంటు న్నారు. ఇటీవ‌ల త‌న‌ను ఇంచార్జ్ మంత్రిగా నియ‌మించిన నేప‌థ్యంలో వెలంప‌ల్లి.. విజ‌యన‌గ‌రం ప‌ర్య‌ట న‌కు వ‌చ్చారు. అయితే, ఈ ప‌ర్య‌ట‌న‌లో అంతా కూడా వెలంప‌ల్లి చేతుల మీదుగా జ‌ర‌గాల్సిన అన్ని కార్య క్ర‌మాల్లోనూ బొత్స డామినేష‌నే క‌నిపించ‌డం గ‌మ‌నార్హం. ప్రెస్ మీట్‌లోనూ ప్ర‌ధాన ప్ర‌సంగం అంతా కూడా బొత్స స‌త్య‌నారాయ‌ణ చేసేశారు. ఇక‌, వెలంప‌ల్లి ఏదో చివ‌రిగా మైకు అందుకుని తూతూ.. మంత్రంగా మాట్లాడి ముగించారు.
ఇక‌, జిల్లా ప‌ర్య‌ట‌న‌లోనూ బొత్స ఎంపిక చేసిన ప్రాంతాలు, నియోజ‌క‌వ‌ర్గాల్లోనే వెలంప‌ల్లి ప‌ర్య‌టించి ముగించారు. దీనిపై ఈ నెల ఆఖ‌రులోగా జ‌గ‌న్‌కు వెలంప‌ల్లి నివేదిక అందించాల్సిన అవ‌స‌రం ఉంది. ప్ర‌తి జిల్లాలో పార్టీ ప‌నితీరు, మంత్రులు, ఎమ్మెల్యేల తీరుపై సీఎంకు ఇన్‌చార్జ్ మంత్రులే నివేదిక ఇస్తారు. ఈ క్ర‌మంలో విజ‌య‌న‌గ‌రం జిల్లాలో పార్టీ ప‌నితీరుతో పాటు మంత్రి బొత్స విష‌యంలో వెల్లంప‌ల్లి ఎలాంటి ?  నివేదిక ఇస్తారో ? ఈ పాటికే మీకు అర్థ‌మై ఉండాలి క‌దూ...!