విజయవాడలో నిరుపేదలకు వెంకట్ కోగంటి వితరణ - 10000 మందికి అన్నదానం

August 11, 2020

కాలిఫోర్నియాలో ఉన్న తానా జాయింట్‍ ట్రెజరర్‍ కృష్ణ జిల్లా కంచికచర్ల వాసి వెంకట్‍ కోగంటి స్వరాష్ట్రంలోని పేదలను ఆదుకునేందుకు ముందుకు వచ్చారు. కోవిడ్‍ 19 సంక్షోభం, లాక్‍డౌన్‍ వల్ల ఇబ్బందులు ఎదుర్కొన్న నిరుపేదలకు వలస కార్మికులకు భోజనం అందించాలన్న నిర్ణయంతో తానా నాయకుల సహకారంతో విజయవాడలో అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. May 11 న మెుదలు పెట్టి గత 10 రోజులుగా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ప్రతిరోజు 1000మందికి అన్నదానం చేస్తున్నారు. అలంకార్‍ సెంటర్‍, రైల్వేస్టేషన్‍, అన్న క్యాంటీన్‍, బెంజ్‍ సర్కిల్‍, రామవరప్పాడు రింగ్‍ రోడ్డు ఇతర చోట్ల ఈ అన్నదానం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. కరోనా కష్టకాలంలో దాదాపు 10,000 మందికి అన్నదానం చేయాలని అనుకుంటున్నట్లు వెంకట్‍ కోగంటి చెప్పారు. శ్రీనివాస్‍ వల్లూరిపల్లి, కోనేరు శ్రీకాంత్, మద్దతుతో ఈ అన్నదానం కార్యక్రమాన్ని నిర్వహించినట్లు చెప్పారు.వెంకట్‍ కోగంటి అమృతహస్తం ఛారిటబుల్‍ ట్రస్ట్ కరుణశ్రీ,, ఆంజనేయులు కొత్త తో కలిసి ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించినట్లు మరియు వారికి కూడా తానా తరుపున ధన్యవాదాలు తెలిపారు.

తానా అధ్యక్షుడు జయ్‍ తాళ్ళూరి, ఫౌండేషన్‍ చైర్మన్‍ నిరంజన్‍ శృంగవరపు, మాజీ అధ్యక్షులు అధ్యక్షులు జయరామ్ కోమటి, నాదెండ్ల గంగాధర్, సతీష్‍ వేమన, బోర్డ్ చైర్మన్ హరిష్ కోయ, వైస్‍  ప్రెసిడెంట్‍ అంజయ్యచౌదరి లావు, సెక్రటరీ రవి పొట్లూరి తదితరులకు వెంకట్‍ కోగంటి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు.