వెంకీమామ రిలీజ్ సో స్పెషల్.. ఎందుకంటే..?

August 01, 2020
CTYPE html>
తెలుగులో మల్టీ స్టారర్ సినిమాలు చాలా తక్కువ. ఎవరెన్ని మాటలు చెప్పినా.. చివరకు సినిమా చేసే విషయం వరకూ రారు. హిందీతో పోలిస్తే.. తెలుగులో మల్టీస్టారర్ మూవీ చేసేందుకు ముందుకు వచ్చే అగ్ర హీరోలు చాలా తక్కువ. ఈ కొరతను తీరుస్తూ.. ఓపక్క రాజమౌళి క్యాంప్ నుంచి ఆర్ఆర్ఆర్ సినిమా వస్తుంటే.. దాని కంటే ముందే స్టార్ట్ అయిన వెంకీ మామ ఈ రోజు (శుక్రవారం) విడుదల కానుంది.
ఇటీవల కాలంలో పలువురితో కలిసి మల్టీస్టారర్ సినిమాలు చేసిన హీరోగా వెంకటేశ్ ను చెప్పాలి. ఆయన చేసినన్ని మల్టీస్టారర్ ఫిలింస్ ఇటీవల కాలంలో తెలుగులో ఎవరూ చేయలేదు. ఈ సినిమా రిలీజ్ కు సంబంధించి ఆసక్తికర విషయం ఒకటి బయటకు వచ్చింది.
రిలీజ్ రోజున వెంకేశ్ కు డబుల్ థమాకాగా చెబుతున్నారు. ఎందుకంటే.. వెంకటేశ్ పుట్టినరోజు ఇవాళే. తన బర్త్ డే వేళ తన సినిమా విడుదల కావటం అనుకోకుండా జరిగిందంటున్నారు. నటుడిగా 33 ఏళ్ల కెరీర్ పూర్తి చేసుకున్న వెంకటేశ్.. మిగిలిన హీరోలకు కాస్త భిన్నమని చెప్పక తప్పదు. ఆయన గత సినిమాలకు వెంకీమామ సో స్పెషల్ అంటున్నారు. బర్త్ డే రోజున విడుదల అవుతున్న వెంకీమామకు ప్రేక్షకుల ఆదరణ పక్కా అన్న ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరి.. ప్రేక్షకులు ఎలాంటి తీర్పు ఇస్తారో?