వెంకీ మామ... అబ్బ అదరగొట్టేశాడు

May 31, 2020

భిన్నమైన సినిమాలతో ప్రత్యేక శైలి ఏర్పరుచుకున్న నాగ చైతన్య... కాంపిటీషనుకు, కంపేరిజన్ కు దూరంగా తన మానాన తాను సినిమాలు చేసుకుంటున్నాడు. చాలా సైలెంటుగా హిట్లు బుట్టలో వేసుకున్నాడు. తాజాగా తన సొంత మామతో రీల్ లైఫ్ మాను చేసుకుని మనసును హత్తుకునే కథతో మన ముందుకు వచ్చాడు నాగ చైతన్య. 

కుటుంబ ప్రేక్షకులను అలరించడంలో వెంకీది పీహెచ్ డీ. తెలుగు వారికి అత్యంత ఆత్మీయ బంధుత్వం మేనమామ. అసలు మేనమామ లేకుండా తెలుగింట ఏ ఫంక్షను జరగదు. అలాంటి సబ్జెక్టుతో సొంత మామను రీల్ లైఫ్ కి తెచ్చి బ్రహ్మాండమైన కథతో ముందుకు వస్తున్న వెంకీ మామ టైటిల్ సాంగ్ తాజాగా విడుదల అయ్యింది. అయ్యి అవగానే సూపర్ టాక్ తెచ్చుకుంది. ట్విట్టరు నిండా వెంకీ మామ సందడే కనిపిస్తోంది. రామజోగయ్య శాస్త్రి తెలుగు బంధాలను మరింత తియ్యగా వివరిస్తూ రాసిన సాహిత్యం అందరి అప్ లాజ్ అందుకుంటోంది. మొత్తానికి మామా అల్లుల్లు సంక్రాంతి కంటే ముందుగానే మన ప్రేమను దోచేలా ఉన్నారు. ఆ పాటను మీరూ ఒకసారి వినండి.

Read Also

కేసీఆర్ కి కేంద్రం మాస్టర్ స్ట్రోక్ !
రేవంత్ వ‌ర్సెస్ కోమ‌టిరెడ్డి
ఆర్టీసీ మీద పగ తర్వాత... సిటీలో దీని సంగతి చూడు కేసీఆర్