సమంత... అన్ బిలీవబుల్ ఫొటో

August 06, 2020

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండటం పెద్ద విషయం కాదు. పెట్టే పోస్టులతో ఇమేజ్ ను అంతకంతకూ పెంచుకోవటమే కాదు.. పాజిటివ్ రెస్పాన్స్ ఉండేలా పోస్టులు పెట్టటం అంత తేలికైన విషయం కాదు. ఈ విషయంలో సమంత టాలెంట్ మామూలుగా ఉండదు. ఎప్పుడేం ఫోటోలు పోస్టు చేయాలో.. తనను తాను హాట్ టాపిక్ గా మార్చుకోవాలో ఆమెకు బాగా తెలుసు. ఆమె నటించిన తాజా చిత్రం జాను ఈ వారం విడుదల అవుతోంది.

ఇలాంటి వేళ.. తన సోషల్ మీడియా ఖాతాలో ఆమె పోస్టు చేసిన ఫోటో ఇప్పుడు అందరి చూపు పడేలా చేసింది. రవివర్మ పెయింటింగ్ లో ఫేమస్ అయిన నిమ్మ పండు పట్టుకొని.. వాలు చూపులు చూసే పెయింటింగ్ ను ఇమిటేట్ చేస్తూ.. అదే తరహా చీరతో పైటను కాస్త జార్చి.. చేతిలో నిమ్మపండుతో సమంత దిగిన ఫోటో చూసినోళ్లు ఎవరైనా ఫిదా కావాల్సిందే.

రవివర్మ పెయింటింగ్ కు రిప్లికా మాదిరి ఉండేలా అన్ని జాగ్రత్తలు తీసుకున్న ఈ ఫోటో షూట్ లో.. పెయింటింగ్ లోని భామ కళ్లల్లో కనిపించే కవ్వింపును ఏ మాత్రం మిస్ కాకుండా చేయటమే కాదు.. వావ్ సామ్ అనేలా ుందని చెప్పాలి. రవివర్మ పెయిటింగ్ కు వాస్తవ రూపం నువ్వే అన్నట్లుగా ఉన్న ఈ ఫోటో ఇప్పుడు వైరల్ గా మారింది. చేతిలో నిమ్మపండుతో సామ్ చంపేస్తుందని చెప్పక తప్పదు.