యాంకర్ సుమ తట్టుకోలేని బ్యాడ్ న్యూస్

February 24, 2020

తెలుగు సినిమా పరిశ్రమ మరో ప్రముఖుడిని కోల్పోయింది. రాజీవ్ కనకాల తండ్రి, ప్రముఖ నటుడు దేవదాస్ కనకాల (74) కొద్దిసేపటి క్రితం మరణించారు. ఆయన కొంత కాలంగా అనారోగ్యం బారిన పడ్డారు. కొద్ది రోజులుగా ఓ ప్రముఖ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం సాయంత్రం మరణించారు. దేవదాస్ కనకాల తెలుగు చిత్రాల్లో ఎన్నో కీలక పాత్రలు పోషించారు. ఆయన కుమారుడే రాజీవ్ కనకాల. ప్రముఖ యాంకర్ సుమ ఆయన కోడలు. కనకాలకు ఒక కుమార్తె కూడా ఉన్నారు. ఆయన స్వస్థలం తూర్పుగోదావరిలో అంతర్భాగంగా ఉన్న కేంద్రపాలిత ప్రాంతం యానాం.

కేవలం నటుడిగానే కాకుండా దర్శకుడిగా కూడా దేవదాస్ కనకాలకు మంచి గుర్తింపు ఉంది. చలిచీమల, నాగమల్లి చిత్రాలకు కనకాల దర్శకుడిగా చేశారు. అయితే, నటుడిగానే అందరికీ ఆయన సుపరిచితులు. హైదరాబాద్ లో యాక్టింగ్ స్కూల్ కూడా నడిపారు. ఓ సీత కథ, చెట్టుకింద ప్లీడర్, గ్యాంగ్ లీడర్, అమ్మో ఒకటో తారీకు, మనసంతా నువ్వే, కింగ్, జోష్, భరత్ అనే నేను చిత్రాలు ఆయనకు మంచి పేరును తెచ్చిపెట్టాయి. దేవదాస్ కనకాల మృతితో ఫిల్మ్ నగర్ లో విషాదం నెలకొంది.