ఆయనే కాంగ్రెస్ కు రాజీనామా... ఊహించగలమా ఇది?

December 07, 2019

నేటి రాజకీయాల్లో నేతలు పార్టీలు మారడం సాధారణమైపోయింది. ప్రజలు కూడా ఆశ్చర్యపోవడం లేదు. అయితే... ఎలాంటి పరిస్థితులు వచ్చినా కొందరు నేతలు పార్టీలు మారరు. అలాంటి వారు ఇంకా సమాజంలో ఉన్నారు. అయితే... పరిస్థితులు అలాంటి వారిని కూడా మార్చేస్తున్నాయి. కాంగ్రెస్ వరుస సెల్ఫ్ గోల్స్ తో తనను తాను నాశనం చేసుకుంటున్న నేపథ్యంలో... పార్టీలో ఉంటే మనమూ నాశనం అవుతామని బయటకు రాక తప్పడం లేదు కొందర నేతలకు. అలాంటి నేత మూడు తరాల కాంగ్రెస్ పెద్దలకు దగ్గరయిన వి.హనుమంతరావు. హన్మంతన్న అని కాంగ్రెసోళ్లు పిలుచుకుంటారు.
ఆయన ఏ విషయంపై అయినా స్పందిస్తారు. మొహమాటం లేకుండా తన అభిప్రాయం చెబుతారు. ఇలాంటి వారి వల్ల పార్టీకి ఇతర లాభాల సంగతేమో గాని పార్టీకి నైతిక బలం. కానీ ఎప్పటికపుడు తప్పులు చేస్తూ కాంగ్రెస్ కుదేలవుతుండటంతో సీనియర్ నేతలు పార్టీ వీడక తప్పని పరిస్థితి. వీహెచ్ కూడా కాంగ్రెస్‌కు గుడ్ బై చెప్పేందుకు రెడీ అవుతున్నారంటే కాంగ్రెస్ పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో మరి. ఇదేమీ గాసిప్ కాదు. ఆయనే చెప్పారు. ’’రాజీవ్‌ గాంధీ జయంతి తర్వాత పార్టీ మార్పుపై నిర్ణయం తీసుకుంటాను‘‘ అని స్వయంగా వీహెచ్ ప్రకటించారు. ఆయన పార్టీ అంటూ మారితే అది బీజేపీలోకి అయి ఉంటుంది. వేరే అవకాశం కూడా పెద్దగా కనిపించడం లేదు. ఎందుకంటే... ఎన్నో డక్కామొక్కీలు తిన్న వీహెచ్ ను టీఆర్ఎస్ లోచేర్చుకుంటే... ఆయన ఏది పడితే అది మాట్లాడే వ్యక్తి. పొరపాటున కాంగ్రెస్ లో అన్నట్టే టీఆర్ఎస్ లో చేరాక కేసీఆర్ ని ఓ మాట అంటే అది కష్టం. కాబట్టి... ఆయన కచ్చితంగా బీజేపీని ఎంచుకుని ఉంటారు. త్వరలో ఆ ప్రకటన వస్తుంది. కార్యకర్తలు, అభిమానులతో చర్చించి తర్వాత తన నిర్ణయాన్ని ప్రకటిస్తానన్నారు.

ఇదిలా ఉంటే... కాంగ్రెస్ పై ఆయన తన అసంతృప్తిని వెళ్లగక్కారు. లోక్‌సభ ఎన్నికల్లో ఖమ్మం టికెట్‌ అడిగితే.. తన పేరు లేకుండానే జాబితా సిద్ధం చేసి అవమానించారన్నారు. హైకమాండ్‌ కొందరు నిజాయతీపరులకు అన్యాయం చేస్తోందన్నారు. రాజీవ్‌ గాంధీ అభిమానులకు పార్టీలో అన్యాయం జరుగుతోందని వీహెచ్‌ వ్యాఖ్యానించడం విశేషం. దశాబ్దాల పాటు కాంగ్రెస్‌లో కొనసాగిన వీహెచ్... రాజీవ్ గాంధీకి సన్నిహితుడు. ఆ తరువాత కాంగ్రెస్ మాజీ చీఫ్ సోనియాగాంధీతోనూ ఆయనకు సత్సంబంధాలున్నాయి. ఆ విధేయత వల్లే ఆయనకు మూడు సార్లు కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యత్వం దక్కింది. ఇది అరుదైన విషయం. 

Read Also

ఆ పదవిని మళ్లీ కమ్మోళ్లకే ఇచ్చిన జగన్
140 కోట్లు పెట్టి మన హీరోయిన్ ఇల్లు కొనేసింది !!
విజయవాడలో దేశద్రోహులు !