ఎన్నారై మొగుళ్లు బాగా వేధిస్తున్నారటగా....

August 03, 2020

జోకు కాదు. మన పార్లమెంటులో మంత్రి చెప్పిన నిజం. ఎన్నారై మొగుడ్ని తెచ్చుకుంటే విదేశాలకు పోయి ఫుల్ ఎంజాయి చేయొచ్చన్న ఆలోచన అంత గొప్పదేం కాదు... అది డేంజర్ కూడా కావచ్చని ఆలోచించాల్సిన నిజం. ఎన్నారైలను పెళ్లాడిన మగువల పశ్చాత్తాప పడి... ఈ ఎన్నారై మొగుడు మాకొద్దు బాబోయ్ అని గోల చేసిన వారు ఎంత మంది అని ఒక ఎంపీ ప్రశ్నిస్తే.. మంత్రిగారు సవివరంగా ఆ దుర్మార్గపు మొగుళ్ల గురించి సెలవిచ్చారు.

2015- 796 మంది

2016- 1510 మంది 

2017- 1498 మంది 

2018 -1299 మంది 

2019 - 991 మంది (ఇప్పటివరకు)

ఎన్నారై మొగుళ్లు మాకొద్దు అని కంప్లయింట్ చేశారట మన ప్రభుత్వానికి. వీరి బారి నుంచి కాపాడండి అని మొరపెట్టుకున్నారట. విదేశాంగ శాఖ వద్ద ఉన్న వివరాల ప్రకారమే ఇంత మంది దొంగ మొగుళ్లు ఉంటే... సాఫ్ట్ పెళ్లాల చాటు దాగి బయటకు రాని క్యారెక్టర్లు ఇంకా ఎన్ని ఉన్నాయో మరి? మొత్తానికి 5 సంవత్సరాలకు గాను 6 వేల మంది ఎన్నారైల మొగుళ్లు చేతిలో నరకం చూశారు. మరి ఈ వార్త చదివే వాళ్లలో ఎన్నారై వరుడి గురించి ఎవరైనా ఎదురుచూస్తుంటే కాస్త ఆలోచించాలి మరి.