ఏపీకి కాబోయే సీఎం... 29 ఏళ్ల మహిళ

June 03, 2020

 Image 

చాలా విచిత్రంగా అనిపించిందా. కొంపదీసి బ్రాహ్మణి గురించి ఆర్టికల్ అనుకుంటున్నారా... కాదు. ’’జగన్ రాక్షసుడు‘‘ అంటూ టీడీపీలో భారీ స్పీచ్ ఇచ్చి చంద్రబాబు కంట్లో పడిన విడద రజనీ గురించి. ఈమె ఇపుడు ఏపీ సోషల్ మీడియా కింగ్ (ఆమె అభిమానులిచ్చిన బిరుదు). టీడీపీలో ఉండగా తనను రాజకీయాల్లోకి తెచ్చి మంత్రి పుల్లారావు సీటుపైనే కన్నేసింది మహా వనిత ఈమె. గురువును మించి శిష్యురాలిగా పుల్లారావుకు తెలియకుండా నేరుగా చంద్రబాబు దగ్గరకు వెళ్లి ఎన్ని కోట్లయినా ఖర్చుపెట్టుకుంటాను.. నాకు సీటు ఇవ్వండి గెలిచి చూపిస్తాను అని అడిగింది. చంద్రబాబు ఎగాదిగా చూసి... అడగడానికి అయినా అర్థం ఉండాలి కదమ్మా... మొన్నే రాజకీయాల్లోకి వచ్చావు, పైగా నిన్ను పరిచయం చేసిన మనిషి సీటే అడుగుతున్నావు అని అన్నారట. అంతే మెల్లగా అక్కడి నుంచి తప్పుకున్న రజనీ చంద్రబాబును కలవడం అదే చివరిసారి. 

తర్వాత తనకున్న డబ్బుతో జగన్ ను ఆకర్షించారు. రాజధాని ఇచ్చిన బాబును వదిలి గుంటూరు జిల్లా ప్రజలు తనకు ఓటేస్తారా అన్న అనుమానంతో ఉన్న జగన్ కు ఆమె బంపరాఫర్ ఇచ్చింది. నాకు సీటు ఇస్తే... పార్టీకి అడిగినంత ఇస్తాను, మీరు చెప్పినంత నియోజకవర్గంలో ఖర్చు పెడతాను చెప్పారట. అయితే... పెద్దగా ఆ సీటుపై జగన్ కు ఆశలు లేవు. అది మంత్రి పుల్లారావు సీటు. అతను గెలుస్తాడు అని అనుకున్న జగన్... ఓడిపోయే సీటును ఇస్తే పోయేదేముంది పైగా పార్టీకి మంచి ఫండ్ తీసుకోవచ్చు అని ఆమె ప్రపోజల్ కి తన పారామీటర్స్ లో ఓకే చెప్పారు. 20 ఏళ్లుగా తమ కుటుంబంతో ఉన్న మర్రి రాజశేఖర్ కు ఆ సీటు ఇచ్చినా అతని డబ్బులు పోవడం తప్ప ఉపయోగం లేదు. శేఖర్ కి ఏదైనా మంచి పదవి ఇద్దాం. ఓడే సీటును ఆమెకిద్దాం అనుకుని జగన్ రజనీకి బీఫాం ఇచ్చారు.

జగనే ఊహించని వేవ్ లో ఆమె గెలించింది. అలా 28 ఏళ్లకే వారసత్వం లేకుండా ఎమ్మెల్యే అయ్యింది. డబ్బు ఖర్చుపెట్టడమే కాదు.. మంచి యాక్టివ్ మనిషి. జనాల్లో విపరీతంగా తిరుగుతుంది. సోషల్ మీడియాను విపరీతంగా వాడుతుంది. ఆ క్రమంలో మాస్ కి బాగా రీచ్ అయ్యింది. ఇపుడు కట్ చేస్తే... జగన్ కి ఏకుమేకై కూర్చోంది. నెల రోజుల్లో ఆమె చేసిన షో అంతా ఇంతా కాదు. కరోనా విషయంలో విపరీతంగా తిరుగుతూ తెగ హడావుడి చేస్తోంది. పార్టీ విధానాలను లెక్కచేయడం లేదు. తనకు నచ్చింది చేసుకుంటూ పోతోంది. పబ్లిసిటీలో ఆమెకు తిరుగులేకుండా పోయింది. అయితే.. ఆమె క్యాడర్ అత్యుత్సాహం ఎక్కడిదాకా వెళ్లిందంటే... ఏపీకి కాబోయే సీఎం రజనీయే అని ప్రచారం చేస్తున్నారు. జగన్ వారసత్వం ఆమెకేనట. విడ‌ద‌ల ర‌జ‌నీ కాబోయే సీఎం అంటూ పెద్ద ఎత్తున సోష‌ల్ మీడియాలో ప్రచారం చేసుకోవడంతో పాటు ఆమెకేం తక్కువ అంటున్నారు. ఆమె విజ‌న్‌, ప్రజ‌ల‌కు సేవ చేసే ల‌క్షణం అన్నీ కూడా సీఎంకు ఉండాల్సిన అర్హత‌ల‌కు ఏమాత్రం తీసిపోవ‌ని, పేద‌ ప్రజ‌ల‌కు అండ‌గా నిలుస్తున్నార‌ని, పార్టీ లైన్‌కు అనుగుణంగా ముందుకు సాగుతున్నార‌ని, ఇలా అనేక రూపాల్లో ఆమె గురించి సోష‌ల్ మీడియాలో వార్తలు హోరెత్తుతున్నాయి. వీటిని ప‌రిశీలిస్తున్న వైసీపీ వారికి ఒక‌విధమైన ఏవ‌గింపు క‌లుగుతుండ‌గా... టీడీపీ వాళ్లు ఆమె వ్యవహారాన్ని కామెడీగా చూస్తున్నారు. 

ఆమె ఎలివేషన్ కి పాటలు, వీడియోలు ఓ రేంజ్ లో వదులుతున్నారు. ఫొటో షూట్లకు ప్రత్యేక స్టూడియో కట్టించారావిడ. ఇక రేపట్నుంచి రంజాన్ మొదలవుతోంది కదా ఆమె స్టిల్ చూడండి.

దీనికి ఓ నెటిజన్ కామెంట్ ఇలా రాశాడు : లైటింగ్ - రెడీ మేకప్ - రెడీ బ్యాక్ గ్రౌండ్ - రెడీ మ్యాచింగ్ వాచ్ - రెడీ HD కెమెరా - రెడీ ఎక్షన్..కట్ కట్.. మేడమ్ నటించేటప్పుడు ఖురాన్ను చూడాలి, కెమెరాని కాదు. ఐనా ఇంత తక్కువ పేజీలు ఉన్న ఖురాన్ నేను ఎక్కడ చుడలా..