ఈ ఎమ్మెల్యే కరోనా సూపర్ స్పెడర్ అవుతారా?

June 03, 2020

సామాజిక దూరం అని కేంద్రం పదేపదే మొత్తుకుంటున్నా... ఏపీ వైసీపీ నాయకులు కనీసం మోడీని లెక్క చేయడం లేదు. అయినా కరోనానే లెక్కచేయని వారు మోడీని లెక్క చేస్తారా? ఒకరు కాదు ఇద్దరు కూడా మెజారిటీ వైసీపీ ఎమ్మెల్యేలు సామాజిక దూరం గాలికి వదిలేసి పంచాయతీ ఎన్నికలు దృష్టిలో పెట్టుకుని వీధుల్లో గుంపులు గుంపులుగా తిరుగుతున్నారు. వీరిచ్చే సాయం కోసం జనం ఎగబడేలా చేసి కరోనా సూపర్ స్ప్రెడర్లుగా మారుతున్నారు. 

ఇప్పటికే పలుమార్లు జాతీయ మీడియాలో తీవ్రంగా విమర్శలు వచ్చినా వీరు తీరు మారడం లేదు. ముఖ్యంగా చిలుకలూరిపేట ఎమ్మెల్యే విడదల రజనీ అసలు జంకడం లేదు. ప్రతి క్షణం వాడుకుంటూ ఎలాగైనా ప్రతి పంచాయతీ గెలిచి... మంత్రి పదవిని టార్గెట్ చేస్తోంది. జగన్ గెలవకపోతే పదవికి రాజీనామా చేయండని చెప్పడంతో ఒకట్రెండు సీట్లు ఖాళీ అయితే ఛాన్సు దక్కించుకుందాం అని ఎమ్మెల్యే రజని తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. వందల సంఖ్యలో జనాన్ని పోగేసుకుని ప్రతి ఊరు ప్రతి వాడ తిరుగుతున్నారు. ఆమె వెంట పెద్ద ఎత్తున తిరుగుతున్న జనంలో ఎవరికి కరోనా ఉందో ఎవరికి లేదో తెలియని పరిస్థితి.

ఈ నేపథ్యంలో తన రాజకీయ స్వార్థం కోసం గుంటూరు జిల్లాలను ఎక్కడ బలిచేస్తారో అని జనం బెంబేలెత్తిపోతున్నారు. ఇదంతా కళ్లతో చూస్తున్నా... మీడియాలో వింటున్న ముఖ్యమంత్రి మందలించడం లేదు. దీంతో వారింకా రెచ్చిపోతున్నారు. ఎమ్మెల్యేకు కరోనా వస్తే తనకు తట్టుకోగలిగిన డబ్బు, ఇమ్యునిటీ ఉన్నాయి ఇతరులు ఏమైపోతే నాకేంటి అన్నట్టు ఆమె తిరుగుతున్నారు. తాజాగా ఆమె ఊరేగింపుల ఫొటోలు కింద చూడండి. అసలే భారీ కేసులు నమోదవుతున్న గుంటూరులో ఈమె చర్యల వల్ల పరిస్థితి ఎంత దారుణంగా మారుతుందో తెలియని పరిస్థితి.