విద్వేష స్వార్ధపు రెడ్డి.... విషయం తక్కువ, విద్వేషం ఎక్కువ

August 14, 2020

ప్రతి మనిషి లో స్వార్ధమూ, ప్రేమ రెండూ వుంటాయి. కాని ఈ రెండింటిలో ఆ మనిషి ఎక్కువ శాతం ఆరాధిస్తాడో దాని పైనే ఆ మనిషి జీవితం ఆధారపడుతుంది. మరీ ముఖ్యంగా ప్రతి నిత్యం ద్వేషపూరిత ప్రమాణాలతో సాటి మనిషిని వేలెత్తి చూపేవాడు నిజమైన స్వార్ధపరుడు. అటువంటి వారే మన విజయసాయిరెడ్డిగారు.
అయ్యా విజయసాయిరెడ్డి గారు మీకో చిన్న విన్నపం. దాదాపు కొన్ని నెలల నుండి మీ పోస్టులను ఫాలో అవుతూ వున్న సాటి ఆంధ్రుడిగా నాదో వేదన. ఓ పక్క ప్రపంచమంతా అట్టుడుకుతూ అల్లాడుతుంటే తరాల వైరమన్నట్టూ పని గట్టుకుని అయినదానికి, కానిదానికి ప్రతి నిత్యం ప్రతిపక్ష నాయకుడిని వేలెత్తి చూపడం మీకు సబబా. ప్రస్తుతం ప్రజలు కనిపించని క్రిమికీటకాలకు చిగురుటాకులా రాలిపోతున్నా, తాను పట్టుకున్న కుందేలుకు రెండే కాళ్ళ చందాన మీ గురంతా ప్రతిపక్ష నాయకుల విమర్శల పైనే కేంద్రీకరిస్తున్నారు. పాలకులుగా ప్రజల సమస్యలు కోకొల్లలు. అందునా గడ్డుకాలంలో ప్రజలకు మాటసాయంగా వుండాల్సింది పోయి, చచ్చు విమర్శలకు అక్షరాలు దిద్దడం సందర్భోచితమా ఆలోచించండి. ఒక్కోసారి అనిపించింది చంద్రబాబునాయుడిగారి పేరు శ్రీరాముడిగా వుండుంటే మీకెంత పుణ్యం వచ్చేదో. ఎందుకంటే ఆయన పైన, ఆయన పార్టీ పైన మీరు పోస్టు పెట్టని రోజంటూ లేదు. ఎందుకండీ ఇంత ప్రయాస. ఇందుకేనా మీరు పదవిలోకి వచ్చింది. ప్రపంచంమంతా కరోనా మహమ్మారి తో అల్లాడుతుంటే పాకిస్తాన్ మాత్రం తీవ్రవాదులను భారత్ వైపు ప్రేరేపిస్తోంది. ఎందుకంటే పాకిస్తాన్ కు బద్ధ సైద్ధాంతిక శాశ్వత శతృవు భారతదేశం. కాని నాకు తెలిసి మీరు, చంద్రబాబునాయుడుగారి శతృత్వం మరీ అంత కాదేమో అని అనుకుంటున్నాను. చేతనైతే ప్రజలను కరోనా మహమ్మారి నుండి కాపాడే చైతన్యాన్నివ్వండి.
మీరు ఇదంతా చదివినా చదివి నిర్లక్ష్యం చేసినా ఆఖరుగా ఒక్క మాట, మనిషి భావావేశం ఆలోచనతో కూడినదై వుండాలి, విచక్షణా వివేకం కోల్పోయి ప్రవర్తించడానకి మీరు పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాది అయితే కాదు, ఎంతైనా మేము మా ఖర్మానికి ఎన్నకున్న పాలకులు.
ఇట్లు...మీ విషయ విమర్ళకుడు 

RELATED ARTICLES

  • No related artciles found