కొందరు ఏం చేసినా వార్తే

August 05, 2020

విజయ్ దేవరకొండ.

టాలీవుడ్లో ఒక సంచలనం.

అతని ప్రవర్తన, వ్యవహారం, మాటతీరు, యువతలో అతనికి ఉన్న క్రేజు అన్నీ విభిన్నమే.

ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకపోయినా... బ్యాగ్రౌండ్ ఉన్నవారికంటే గొప్ప స్థానాన్ని టాలీవుడ్లో ఆక్రమించాడు.

అతనితో బాలీవుడ్ సినిమా తీసినా డబ్బులు వస్తాయన్న ఆలోచనకు నిర్మాతలు రావడానికి అతనే కారకుడు.

అతని భవితను నిర్మించుకున్నది అతనే. విజయ్ దేవరకొండ... తన పేరులోని విజయాన్ని ఎపుడూ సాధిస్తూనే ఉన్నాడు. 

వరుస హిట్లు పడటం వల్ల ఇది అతనికి సాధ్యం అయ్యింది అనుకోలేం. హిట్లు వచ్చినా జీవితాన్ని కోల్పోయిన వారు చాలామంది ఉన్నారు. 

కెరీర్ ను మల్టిపుల్ గా తీర్చిదిద్దుకోవడమే విజయ్ లక్ష్యం. ఇటీవల సినిమా తారలు సామాన్యులకు సాయం చేయడానికి ఎన్నో మార్గాలు ఎంచుకున్నారు. కానీ విజయ్ ఎంచుకున్న మార్గంపై మాత్రమే అందరిలో చర్చ జరిగింది.

విజయ్ చేసిన సాయం నిజంగా అవసరం అయిన వారికి చేరింది. తాను ఏ కుటుంబం నుంచి వచ్చాడో అలాంటి కుటుంబాల బాధలు గుర్తుపెట్టుకుని విజయ్ వ్యవహరించారు.

ఫాదర్స్ డే నాడు తన తండ్రితో ఉన్న ఫొటోను షేర్ చేస్తూ నా ప్రతి నిర్ణయం వెనుక బ్లైండ్ గా వెంట ఉండే వ్యక్తి అని తండ్రి ప్రేమను పొదివి పట్టుకున్నాడు.

ఈ సంద్భంగా అతని లుక్స్ అందరినీ ఆకర్షించాయి. జులపాల జుట్టుతో కొత్త గడ్డంతో అందరినీలో చర్చకు కేంద్ర బిందువయ్యాడు.

విజయ్ అంతే. విజయ్ అంతే.