సీఎంకి పెద్ద తలనొప్పి క్రియేట్ చేశాడే

August 13, 2020

కరోనా చాలా ఆత్మాభిమానం కలిగిన వైరస్. తనకు తానుగా ఎవరిని అంటుకోదు. ఎవరైనా తన వద్దకు వస్తే మాత్రం అస్సలు వదిలిపెట్టదు. ఇలాంటి జోకులు చాలానే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. చదివినంతనే పెదాల మీద నవ్వులు పూయించేలా ఉన్నా.. ఈ ప్రమాదకర వైరస్ విషయంలో ఎంత అప్రమత్తంగా ఉండాలన్న విషయాన్ని ఇట్టే అర్థమయ్యేలా చేస్తుందని చెప్పాలి. సామాన్యుల మొదలు సెలబ్రిటీల వరకూ ఎవరిని వదిలిపెట్టని ఈ మహమ్మారి దెబ్బకు పెద్ద పెద్ద రాజకుటుంబాలు.. సినీ.. క్రీడా రంగానికి చెందిన సెలబ్రిటీలతో పాటు.. వ్యాపారస్తులు.. పారిశ్రామికవేత్తలు.. ఇలా చెప్పుకుంటూ లిస్టు పెద్దదే అవుతుంది.
తాజాగా ఆ జాబితాలో మరో ప్రముఖుడు చేరారు.దేశంలో ఇప్పటివరకూ ఎప్పుడు లేని రీతిలో గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపాణీ క్వారంటైన్ లోకి వెళ్లాల్సిన పరిస్థితి చోటు చేసుకుంది. ఒక ఎమ్మెల్యేతో భేటీ అయిన సీఎంకు.. సదరు ప్రజాప్రతినిధికి కరోనా పాజిటివ్ అని తేలటంతో ఆయన ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. తనకు తానుగా క్వారంటైన్ కు వెళ్లాలని నరి్ణయించారు.
రూపాణికి కరోనా లక్షణాలు ఏమీ లేకున్నా.. ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగానే ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు చెబుతున్నారు. బయటకు రాకున్నా.. తానున్న చోటు నుంచి వీడియో కాన్ఫరెన్సులతో పాటు.. ఫోన్ తో మిగిలిన కార్యకలాపాల్ని పూర్తి చేయనున్నారు. అహ్మదాబాద్ లో కొన్ని ప్రాంతాల్లో కర్ఫ్యూ విధించే అంశంపై గుజరాత్ సీఎంతో పాటు.. ఉన్నతస్థాయి సమావేశాన్ని నిర్వహించారు. ఇందులో ఖదియా-జమాలాల్ పుర్ ఎమ్మెల్యే.. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఇమ్రాన్ భేడావాలా పాల్గొన్నారు. అనంతరం ఆయనకు కరోనా వచ్చినట్లుగా తేలింది. దీంతో.. ముందస్తు జాగ్రత్తల్లో భాగంగా ఆయన హోం క్వారంటైన్ లోకి వెళ్లిపోయారు. సో.. మిగిలిన ముఖ్యమంత్రులు కొన్ని జాగ్రత్తల్ని తీసుకోవాల్సిన అవసరముంది.