శ్రీల‌క్ష్మి కోసం సాయిరెడ్డి ప్ర‌ద‌క్షిణ‌లు... రీజ‌న్ ఇదే...!

July 05, 2020
CTYPE html>
సొంత బంధువులే అయినా.. మ‌న అని అనుకున్న వారితో ఒక‌లా.. మామూలుగా ఉండే వారితో ఒక‌లా వ్య‌వ‌హ‌రించ‌డం మ‌న‌కు మామూలే. ఇక‌, రాజ‌కీయాల్లోను, కార్యాల‌యాల్లోనూ ఈ త‌ర‌హా సంస్కృతి ఎప్పుడూ ఉంటుంది. ఆఫీసుల్లో కూడా ఎంత‌మంది ఉన్న‌తాధికారులు ఉన్నా.. కిందిస్థాయి అధికారులు ఉన్నా.. పై అధికారులు మాత్రం మ‌న అని అనుకున్న అటెండర్ల‌ను లేదా కింది స్థాయి అధికారుల‌ను న‌మ్మినంత తేలిక‌గా, వారికి అప్ప‌గించినంతగా ప‌నులు ఇత‌రుల‌కు అప్ప‌గించరు. ఇక‌, రాజకీయాల్లోనూ మ‌న అనుకునే వారికే అంద‌లాలు అందుతుంటాయి.

దీనికి కేవ‌లం ఒకే ఒక రీజ‌న్ వెంటాడుతుంటుంది. అదే.. మ‌న ప‌నులు చేసి పెడ‌తారు.. మూడో కంటికి కూడా తెలియ‌కుండా ప‌నులు పూర్త‌వుతాయ‌నే ఏకైక విశ్వాసం. ఈ క్ర‌మంలోనే కీల‌క పోస్టులు, ప‌దవులు అన్నీ కూడా మ‌న అని అనుకున్న‌ వారికే అప్ప‌గించ‌డం మ‌నం చూస్తుంటాం. ఇప్పుడు వైసీపీ ప్ర‌భుత్వం కూడా మ‌న అని అనుకున్న వారి కోసం ఎంత దూర‌మైనా వెళ్లేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తోంది. దీనిలో భాగంగా గడిచిన నాలుగు మాసాల్లో జ‌రిగిన, ఇప్ప‌టికీ జ‌రుగుతున్న ప‌రిణామాల‌ను మ‌నం గ‌మ‌నిస్తున్నాం.  ఏ ప్ర‌భుత్వానికి అయినా.. కీల‌క‌మైన అధికారులు ఎవ‌రు అంటే.. సీనియ‌ర్ ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లే..!

త‌మ‌కు అనుకూలంగా చ‌క్రం తిప్పేవారిని ఏ ప్ర‌భుత్వ‌మైనా కీల‌క స్థానంలో కూర్చోబెడుతుంది. దీనికి చంద్ర‌బాబు అయినా.. జ‌గ‌న్ అయినా.. ఎవ‌రైనా అతీతులు ఎంత‌మాత్రం కాదు. కాక‌పోతే.. ఇప్పుడు జ‌గ‌న్ చుట్టూ మాత్ర‌మే ఇలాంటి వార్త‌లు హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి. సీనియ‌ర్ ఐఏఎస్ అధికారిణి, జ‌గ‌న్ కేసుల్లో గ‌తంలో విచార‌ణ ఖైదీగా ఉన్న శ్రీల‌క్ష్మి కోసం జ‌గ‌న్ ప్ర‌భుత్వం వేయి క‌ళ్ల‌తో వేచి చూస్తోంది. వాస్త‌వానికి ఆమె రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత త‌న ఇంపార్టెన్స్‌ను తెలంగాణ‌కే ఇచ్చారు. దీంతో ఆమె అక్క‌డే ఉండిపోవాల్సి వ‌చ్చింది. కానీ, ఐదేళ్లు గ‌డిచేస‌రికి ఏపీలో జ‌గ‌న్ ప్ర‌భుత్వం కొలువుదీరింది. దీంతో ఆమె వెంట‌నే మ‌న‌సు మార్చుకుని జ‌గ‌న్ ఆధ్వ‌ర్యంలో ప‌నిచేయాల‌ని భావిస్తున్న‌ట్టు నేరుగా ప్ర‌భుత్వానికి లేఖ పెట్టింది.

అదే స‌మ‌యంలో జ‌గ‌న్ స‌ర్కారు కూడా త‌మ‌కు అనుకూలంగా గ‌తంలో వ్య‌వ‌మ‌రించిన శ్రీల‌క్ష్మిని తీసుకువ‌చ్చి న‌వ‌ర‌త్నాలు వంటి కీల‌క ప‌థ‌కాల‌కు నియ‌మించాల‌ని చూస్తోంది. కానీ, ఆమె కేంద్ర ప్ర‌భుత్వ స‌ర్వీసుల అధికారి కావ‌డంతో ఈ విష‌యం కేంద్రం ఒప్పుకొంటేనే జ‌రుగుతుంది. ఈ నేప‌థ్యంలో కేంద్రం వ‌ద్ద రాయ‌బారిగా వైసీపీ ఎంపీ విజ‌య‌సాయి రెడ్డి తీవ్రంగా ప్ర‌య‌త్నిస్తున్నారు. ఎక్కేమెట్లు, దిగేమెట్లు అయినా భారం కాకుండా ఆమె కోసం ఆయ‌న ప్ర‌య‌త్నిస్తున్నారు. ఇప్ప‌టికేత‌మ‌కు అనుకూల‌మైన ఐపీఎస్ అధికారి స్టీఫెన్‌స‌న్‌ను తెచ్చుకోలేక పోవ‌డం మైన‌స్‌గా మారిన నేప‌థ్యంలో ఇప్ప‌టికైనా శ్రీల‌క్ష్మిని సాధించి.. రాష్ట్రంలో త‌మ‌కు తిరుగేల‌ని బ‌ల‌మైన అధికారిని నియ‌మించుకునే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. మ‌రి ఇది ఎప్ప‌టికి స‌క్సెస్ అవుతుందో చూడాలి.

Read Also

సాహో శరద్‌ పవార్!
Viral: కొడాలి నానిని చెడుగుడు ఆడిన ఓ మహిళ
అపుడు కియా, ఇపుడు బూతులు... మేడిన్ ఏపీ