విజ‌య‌సాయి ఇరిటేష‌న్ కు కారణం ఇదేనా?

September 17, 2019

విచిత్ర‌మైన తీరు వైఎస్సార్ కాంగ్రెస్ లో క‌నిపిస్తోంది. రాజ‌కీయ పార్టీ ఏదైనా.. రాజ‌కీయ నేత ఎవ‌రైనా స‌రే పోలింగ్ జ‌రిగిన రోజున‌.. పోలింగ్ ప‌క్క రోజున తమ‌కున్న అభ్యంత‌రాల్ని ఏక‌రువు పెడ‌తారు. కానీ.. తీరిగ్గా.. పోలింగ్ జ‌రిగిన ముప్ఫై ఐదు రోజుల త‌ర్వాత పెడ‌బొబ్బ‌లు పెట్ట‌టం జ‌గ‌న్ బ్యాచ్ కు మాత్ర‌మే సాధ్య‌మ‌వుతుంది.
కొంద‌రు చెప్పిన మాట‌ల‌కు వేగంగా స్పందించే వ్య‌వ‌స్థ‌లు త‌యారైన వేళ‌.. కొన్ని ఫిర్యాదుల‌పై యుద్ధ ప్రాతిప‌దిక‌న నిర్ణ‌యాలు.. మ‌రికొంద‌రి కంప్లైంట్ ను తీరిగ్గా చూసే ధోర‌ణి ఇప్పుడు కొట్టొచ్చిన‌ట్లుగా క‌నిపిస్తోంది. ఏదైనా పార్టీ ఒక విష‌యం మీద ఒక స్టాండ్ తీసుకుంటుంది. కానీ.. ఏపీలో జ‌రిగిన ఎన్నిక‌ల మీద జ‌గ‌న్ ప‌రివారంలో రెండు స్టాండ్స్ క‌నిపించ‌టం ఆస‌క్తిక‌రంగా మారింది.
పోలింగ్ జ‌రిగిన రోజున చిన్న‌పాటి అభ్యంత‌రాన్ని వ్య‌క్తం చేయ‌ని జ‌గ‌న్‌.. సాయంత్రం నాటికి ఏపీ నుంచి హైద‌రాబాద్‌లోని లోట‌స్ పాండ్ కు వెళ్లిపోవ‌టం తెలిసిందే. పెద్ద ఎత్తున ఈవీఎంలు మొరాయించి.. ఏపీ ఓట‌ర్లు పెద్ద ఎత్తున క్యూలైన్లో నిలుచున్నా.. ఈసీని ప‌ల్లెత్తు మాట అన‌టం త‌ర్వాత‌.. పోలింగ్ ను బాగా నిర్వ‌హించిన‌ట్లుగా కితాబు ఇచ్చి అంద‌రిని ఆశ్చ‌ర్యానికి గురి చేశారు జ‌గ‌న్‌.
పోలింగ్ జ‌రిగిన నాటి నుంచి ఇప్ప‌టివ‌ర‌కూ జ‌గ‌న్ ఒక్క విమ‌ర్శ చేయ‌లేదు. పైకి కూల్ గా ఉన్న‌ట్లుగా జ‌గ‌న్ బిహేవియ‌ర్ ఉంద‌న్న మాట అంద‌రినోట నానుతోంది. మ‌రి.. అధినేత ఇంత కూల్ గా ఉంటే.. విజ‌య‌సాయి అదే ప‌నిగా ఎందుకంత ఇరిటేట్ అవుతున్నార‌న్న ప్ర‌శ్న‌కు స‌మాధానం ల‌భించ‌ని ప‌రిస్థితి. గెలుపు మీద ధీమా అంత ఉన్న‌ప్పుడు ప్ర‌తి విష‌యానికి అదే ప‌నిగా ఆగ్ర‌హాన్ని వ్య‌క్తం చేయ‌టం.. ట్విట్ట‌ర్ లో అదే ప‌నిగా రెచ్చ‌గొట్టేలా వ్యాఖ్య‌లు చేస్తూ.. త‌న స్థాయిని తాను దిగ‌జారేలా చేసుకుంటున్న విజ‌య‌సాయి తీరు విచిత్రంగా ఉందంటున్నారు.
ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం ఏమంటే.. పైకి క‌నిపిస్తున్న జ‌గ‌న్ కూల్.. నిజం కాద‌ని..తానంత క‌ష్ట‌ప‌డినా ప్ర‌జ‌లు త‌న‌ను న‌మ్మ‌ని వైనంపై ఆయ‌న డిప్రెష‌న్ లో ఉన్నార‌ని.. అందుకే మౌనంగా ఉన్న‌ట్లు చెబుతున్నారు. మ‌రోవైపు అదే ప‌నిగా చెల‌రేగిపోతున్న విజ‌య‌సాయి తీరు.. చివ‌రికంటా పోరాడినా.. బాబు దుర్మార్గాల కార‌ణంగా గెలిచారే త‌ప్పించి.. గెలుపు మాదే అన్న భావ‌న క‌లిగించేందుకు.. ఓట‌మి త‌ర్వాత.. మేం ముందునుంచీ చెబుతూనే ఉన్నామ‌న్న ఎలిబీ కోస‌మే విజ‌య‌సాయి ఇంత‌గా ఇరిటేట్ అవుతున్న‌ర‌ని చెబుతున్నారు.