విజయసాయిరెడ్డిని ఉతికారేశాడు

August 10, 2020

జగన్ ఈరోజు అందరి మధ్యన పరువు పోగొట్టుకుని తలెత్తుకోలేని స్థితిలో ఉన్నారంటే దానికి విజయసాయిరెడ్డి కారణం అని వేలెత్తిచూపారు రఘురామరాజు.

న్యాయనిపుణులు, రాజకీయ విశ్లేషకులు, సీనియర్ నేతలు అందరూ నిమ్మగడ్డ కేసులో ప్రభుత్వానిదే తప్పని చెప్తున్నారు.

అయినా విజయసాయిరెడ్డి ఇంకొందరు చెత్త సలహాలు ఇచ్చి జగన్ ని ప్రభావితం చేశారని రఘురామరాజు విమర్శించారు. 

ప్రభుత్వంలో బాధ్యత గల పదవుల్లో  కొలువైన పెద్దలు.. న్యాయవ్యస్థను ఇంకా తిట్టండి, సోషల్ మీడియాలోనూ తిట్టండి మేము చూసుకుంటాం, అండగా ఉంటాం అని బహిరంగంగా ప్రోత్సహించిన దుష్ఫలితం ఇది.

దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయని తప్పు చేయడానికి జగన్ పక్కనున్న వారు కారణం అయ్యారు అంటూ విజయసాయిరెడ్డిని పరోక్షంగా తప్పుపట్టారు. 

నిజానికి నిమ్మగడ్డ రమేష్ కుమార్ కేసులో... గవర్నర్ నిర్ణయంతోనే పార్టీకి దారులన్నీ మూసుకుపోయాయి. ముందు తొందరపడ్డాం. తర్వాత మేలుకోలేదు. ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఒక కులం గురించి మాట్లాడటం పెద్ద తప్పటడుగు.

రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని, న్యాయవ్యవస్తను గౌరవించుకుంటూ ముందుకు పోవాలని... చెప్పుడు మాటలు వినొద్దని RRR సలహా ఇచ్చారు.

ఒకరకంగా ఆయన ప్రతి మాట సాయిరెడ్డిని టార్గెట్ చేసినట్టే ఉంది. 

కరోనాతో సహజీవనం చేద్దామని సీఎం జగన్ పిలుపునిస్తే జనం ఆయన మాట విని పోలోమంటూ బయటకువచ్చారు.

అలా చేయడానికి ప్రపంచంలో బెడ్లు సరిపోవు. సహజీవనానికి సిద్ధపడ్డ ప్రజలు.. ఇవాళ చావుబతుకుల్లో కొట్టుమిట్టాడుతున్నారు.

కొవిడ్  పారాసిటమాటల్ తో తగ్గదు. రోజుకు ఆరు డోసుల మందుకు రూ.30 వేలు ఖర్చవుతుంది. కరోనాను ఆరోగ్య శ్రీలో చేర్చారు... మరి చికిత్స చేయడానికి మందులు సరిపడా అందుబాటులో లేవు. మరి ఏంప్రయోజనం అని ప్రశ్నించారు...

తీరా ప్రజలను గాలికి వదిలేసి కరోనా సోకిన కీలక నేతలేమో పక్కా రాష్ట్రాలకు పోయి చికిత్స చేయించుకుంటున్నారని అపోలోలో చికిత్స పొందుతున్న సాయిరెడ్డిని టార్గెట్ చేశారు రఘురామరాజు. 

నేరుగా RRR భాషలోనే చెప్పాలంటే...

‘‘అచ్చెన్నాయుడి విషయంలో ప్రభుత్వ ఆస్పత్రులు సరిపోవా అని స్థాయికి తగని కామెంట్లు చేశారు మా పార్టీ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి గారు.

ఇవాళ ఆయనేమో అవే ఆస్పత్రులు నచ్చక కరోనా వస్తే వెళ్లి హైదరాబాద్ కార్పోరేట్ ఆస్పత్రిలో కూర్చున్నారు.

ఇది గురివిందనీతి కాక మరేమంటారు? నిమ్మగడ్డ వ్యవహారంలో ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పులపై సోషల్ మీడియాలో ఇష్టమొచ్చిన కామెంట్లు పెట్టొచ్చని రెచ్చగొట్టంది కూడా ఆయనే.

మనకు సీఐడీ ఉంది, సోషల్ మీడియా కార్యకర్తలకు అండగా ఉంటాం అని పదే పదే నాయకత్వం చెప్పడం వల్లే న్యాయవ్యవస్థలపై వైసీపీ క్యాడర్ విమర్శలకు తెగబడుతోంది.

ఇవాళ సుప్రీంకోర్టు ఆ విషయాన్ని కూడా దీనిని తీవ్రంగా పరిగణించింది. అంతిమంగా ఈ విధానాలన్నీ పార్టీకి తీరని నష్టం చేస్తాయి‘‘