​విజయసాయిరెడ్డి పై జనం రివర్స్ ఎటాక్ !

August 07, 2020

విజయసాయిరెడ్డి... ​ట్విట్టరుతో బెడ్ కాఫీ, బ్రేక్ ఫాస్ట్, లంచ్, స్నాక్స్, డిన్నర్ చేస్తారు. ఆయనకు ఓ యాంటీ ఫాన్ బేస్ ఉందండోయ్. వారు ఆయనను ముద్దుగా తాత అని పిలుచుకుంటూ ఉంటారు. ఆయనకు బాబు గురించి, లోకేష్ గురించి ట్వీట్ వేయకపోతే నిద్ర కూడా పోరు.

ఆయన ఎందుకిలా ఉంటారు అన్న అనుమానాన్ని... ఓ నెటిజన్ దీన్ని చక్కగా విశ్లేషించాడు.  సన్నాఫ్ సత్యమూర్తిలో వెన్నెల కిషోర్ కు ఉన్న వ్యాధి నిజజీవితంలో సాయిరెడ్డికి సోకిందని... అందుకే చంద్రబాబు ఎక్కడున్నా సాయిరెడ్డికి మాత్రం చంద్రబాబు, లోకేష్ తన పక్కనే ఉన్నట్టు కనిపిస్తారని వివరించారు.

సాధారణంగా ఈ వ్యాధి సోకిన వారు అందరికీ సాధారణంగా కనిపిస్తారని, సాధారణంగా ప్రవర్తిస్తారని... కానీ కొన్ని క్యారెక్టర్లను మాత్రం తమ పక్కన లేకున్నా వారు నిత్యం కళ్ల ముందు కనిపిస్తున్నట్లు భ్రమపడుతూ మాట్లాడుతుంటారని... ఇది రోగం కాదని, ఒక మానసిక లక్షణం అని దీనికి మందు అనేది లేదని విశ్లేషించారు. నిజమే... అసలు ఇంతవరకు ఈ యాంగిల్ ఎవరూ టచ్ చేయలేదు. 

ఇక సాయిరెడ్డి లేకపోతే ట్విట్టరులో నెటిజన్లకు ఎంతో ఫన్ మిస్సయ్యేదని స్పష్టంగా అర్థమవుతుంది. ఈరోజు సాయిరెడ్డి ట్వీట్ జోక్ ఆఫ్ ద ఇయర్ గా ఏపీ ప్రజలు ప్రకటించారు. 

Image 

చూశారుగా ఈ ట్వీటు... విజయసాయిరెడ్డిలో ఉన్నంత హ్యూమర్ మనం ఎవరిలో చూడం. జోకును చార్లీ చాప్లిన్ లా చాలా సీరియస్ గా చెబుతారు. అందరికీ నవ్వు వస్తుంటుంది. కానీ ఆయన మాత్రం భలే సీరియస్ గా రాస్తుంటారు. గులాబీ మొక్కకు అంటుకట్టినట్టు, ఇటుక ఇటుక పేర్చి ఓ గోడ కట్టినట్లు భలే చెబుతుంటారు.

ఆ మధ్య కూడా పింక్ డైమండ్ గురించి ఇలాగే ఒక మంచి జోక్ పేల్చారు. అసలు పింక్ డైమండే లేదని తర్వాత టీటీడీయే సైలెంటైపోయింది. అందులో ఒక హైలెట్ కూడా ఉంది. గంటలో చంద్రబాబు ఇంటికి వెళ్తే దొరుకుతుందని... ఆలస్యం అయితే, తరలిస్తాడని ఒక అద్భుతమైన మాటన్నాడు.

త్రివిక్రమ్ గ్రేటబ్బా... అతను సరదాగా సృష్టించిన వ్యాధి ఇలా మనుషులకు నిజంగా వస్తుందని ఎవరూ ఊహించి ఉండరు. సాయిరెడ్డిని ఈ వ్యాధి వేధించడం వల్ల ఆయనకు లేనిది ఉన్నట్టుగా, జరగనది, జరిగినట్టుగా కనిపిస్తు ఉంటుంది. కరోనా వైరస్ తో పాటు దీనికి కూడా ఎవరైనా మందుకనిపెడితే భేషుగ్గా ఉంటుంది కదా.