Official : ఏపీని ముగ్గురు రెడ్లకు రాసిచ్చిన జగన్

August 12, 2020

రఘురామ కృష్ణంరాజు చెప్పిందే నిజమైంది. వైసీపీలో వైఎస్ జగన్ రెడ్డిని ఆయన కోటరీ ఒక ఆటాడిస్తోంది అని పలుమార్లు ఆయన చెప్పింది నిజమేనని తాజాగా ఈరోజు వెలువడిన ప్రకటనతో ప్రూవ్ అయ్యింది.

సంస్థాగతంగా వైసీపీని బలోపేతం చేసే పేరుతో పార్టీ తరఫున ముగ్గురు (షాడో) సీఎంలను ఏర్పాటుచేశారు వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత జగన్ రెడ్డి. రాష్ట్రం తన సామాజిక వర్గం గుప్పిట్లో ఉండేలా ఆయన ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. డిప్యూటీ సీఎంలు, అయినా మంత్రులు అయినా ఎంపీలైనా....ఎవరైనా తన సామాజిక వర్గం తర్వాతే అని మరోసారి నిరూపించారు.

బహుశా జగన్ బలం ఇదే. తెలుగుదేశం పార్టీలాగా ఎవరో బయటి వారిని తెచ్చి పార్టీలో కీలక పదవులు అప్పగిస్తే ఎక్కడ దెబ్బతీస్తారో అని కేవలం సొంత వాళ్ల చేతిలో మాత్రమే కీలక పదవులు పెట్టడం వైఎస్ కుటుంబానికి అలవాటే. అందులో భాగంగానే జగన్ తాజాగా కీలక నిర్ణయం తీసుకున్నారు. జిల్లాల వారీగా పార్టీ బాధ్యతలను ముగ్గురు నేతలకు అప్పగించారు. 

విజయసాయిరెడ్డి - శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లా బాధ్యతలు 

వైవీ సుబ్బారెడ్డి - ఉభయగోదావరి, కృష్ణా, గుంటూరు, చిత్తూరు బాధ్యతలు 

సజ్జల రామకృష్ణారెడ్డి - కర్నూలు, అనంతపురం, కడప, నెల్లూరు, ప్రకాశం జిల్లా బాధ్యతలు 

అయితే కీలక ట్విస్ట్ ఏంటంటే... విజయసాయిరెడ్డికే తక్కువ ప్రయారిటీ ఇచ్చినట్టు కనిపిస్తోంది. ఎందుకంటే పార్టీ కేంద్ర కార్యాలయ సమన్వయ బాధ్యతలు మాత్రం సజ్జలకు అప్పగించారు. పార్టీ సీఎం అనుకోవచ్చు ఒక రకంగా !

ఇతరులపై కులముద్ర వేస్తూ తాను మాత్రం అందరూ రెడ్లకే కిరీటాలు పెట్టడం మన జగన్ రెడ్డి స్పెషాలిటీ.