vammo: ఈసీని బండబూతులు తిట్టిన సాయిరెడ్డి

May 25, 2020

మోడీ ముందు బుద్ధిగా ఉన్న నన్ను ఎవడు ఏం పీకలేడు అన్నట్టుంది... విజయసాయిరెడ్డి వరస. రాజ్యాంగ వ్యవస్థ అయిన ఎన్నికల సంఘం కమిషనర్ ను అడ్డమైన బూతులు సోషల్ మీడియా సాక్షిగా తిట్టారు సాయిరెడ్డి. మా మీద ఎవరు కోర్టుకు వెళ్లలేరు. కేంద్రానికి కంప్లయింట్ చేస్తే అక్కడున్న మోడీకి ఆల్రెడీ తాను బానిస కాబట్టి నన్ను ఏం చేయడు అనుకున్నారో ఏమో... చరిత్రలో ఎన్నికల కమిషనర్ ను ఎవరూ తిట్టనన్ని బూతులు తిట్టారు విజయసాయి రెడ్డి. వాస్తవానికి కరోనా దెబ్బకు పరీక్షలు తప్ప అన్నీ రద్దు చేస్తున్నారు. పలుదేశాల్లో ఎన్నికలు కూడా వాయిదావేశారు. ఏపీలో కూడా పోలింగ్, ప్రచారం ద్వారా కరోనా వ్యాప్తి చెందకుండా ఉండటానికి కేంద్ర ఎన్నికల సంఘంతో చర్చించిన అనంతరం రాష్ట్ర ఎన్నికల సంఘం ఏపీలో స్థానిక ఎన్నికలను వాయిదావేసింది. ఇది వైసీపీ నేతలకు కోపం తెప్పించింది. జగన్... కరోనాను తీసిపడేశారు. WHO .. కరోనాను ప్రపంచ మహమ్మారిగా గుర్తిస్తే... మన దేశం... జాతీయ విపత్తుగా గుర్తించింది. కానీ జగన్ మాత్రం అసలు అది వ్యాధే కాదు. పారసిటమాల్, బ్లీచింగ్ పౌడర్ తో తగ్గించి వేయొచ్చు దాని కోసం ఎన్నికలు వాయిదావేస్తారా? నువ్వు కమ్మోడు. బాబు చెప్పినట్లు విని ఎన్నికలు వాయిదా వేస్తావా అని ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి మీడియా ముందు బెదిరించారు. 

ఇక ముఖ్యమంత్రి అలా మాట్లాడితే సాయిరెడ్డి ఊరికే ఉంటారా... చిచ్చరపిడుగు అయిపోయారు. వీళ్లు తనను చంపుతారేమో అని ఈసీ భయపడేలా తిట్లు తిట్టారు. సాయిరెడ్డి ఏమన్నారో ఆయన మాటల్లో వింటే...

 ‘ఆయన నిమ్మగడ్డ రమేష్ కాదు. నారా వారి రమేష్ అని చెప్పుకోవాలి. కరోనా వైరస్ కంటే నిమ్మగడ్డ రమేష్ అత్యంత ప్రమాదకారి. కనకపు సింహాసనం మీద శునకాన్ని కూర్చోబెడితే ఏం చేస్తుందో, నిమ్మగడ్డ రమేష్ ఈ రోజు అదే పనిచేశారు. హెల్త్ సెక్రటరీ, చీఫ్ సెక్రటరీని సంప్రదించుకుండా, ప్రభుత్వం అభిప్రాయాలు తీసుకోకుండా నిర్ణయాన్నిఎలా ప్రకటిస్తారు? రాజకీయ పార్టీలతో చర్చించకుండానే వాయిదా వేశారు. రమేష్ కులపిచ్చి, ఎల్లో సూసైడ్ స్క్వాడ్‌లో మెంబర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు సిగ్గుంటే, నైతిక విలువలు ఉంటే రాజీనామా చేయాలి. నిమ్మగడ్డ రమేష్ అనేకంటే నారావారి గబ్బిలం అని పిలిస్తే బాగుంటుంది.’ అంటూ విజయసాయిరెడ్డి తీవ్రంగా కామెంట్స్ చేశారు. 

రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ తీసుకున్న నిర్ణయంపై సుప్రీంకోర్టు కు వెళతాం. ఆయన తీసుకున్న నిర్ణయం తప్పో, ఒప్పో... కరెక్టో కాదో సుప్రీంకోర్టే తేలుస్తుందన్నారు. ఏది ఏమైనా... ఈరోజు వైసీపీ అధినతే జగన్ గాని, విజయసాయిరెడ్డి గాని వ్యవహరించిన తీరు చూసి ఏపీ ప్రజల్లో కొత్త అనుమానాలు మొదలయ్యాయి. వీరి చేతుల్లో రాష్ట్రం ఉంటే... మన భవిష్యత్తు ఏమైపోతుందో అనే శంక చాలా తీవ్రంగా ప్రజల్లో కలిగేలా వీరిద్దరు మాట్లాడారు. ఒకరకంగా చెప్పాలంటే... జగన్ , విజయసాయిరెడ్డి మీడియా సమావేశాలు ఏపీలో జగన్ పతనానికి నాంది పలికాయని చెప్పొచ్చు.