ఇంత అడ్డంగా బుక్కయ్యావేం సాయిరెడ్డి ?​

June 02, 2020

ఏ మాత్రం విలువలు లేని భాషతో నిత్యం చంద్రబాబు లేదా ప్రతిపక్షాలపై విరుచుకుపడే విజయసాయిరెడ్డి తాజాగా అడ్డంగా దొరికిపోయాడు. ఆయన వేసే ట్వీట్లలో మెజారిటీ అబద్ధాలే. ఎవడు అడగుతాడు మమ్మల్ని అబద్ధాలు చెబితే అనుకుంటూ లేశ మాత్రమైనా ఆధారం లేకుండా ఎదుటివారిపై తీవ్రమైన ఆరోపణలు చేసే విజయసాయిరెడ్డి తమ నేతను పొగుడుతూ అంతే స్థాయిలో అబద్ధాలు చెబుంటారు. 

పాపం వైసీపీ పార్టీ సొంత పత్రిక సాక్షి అనుకోకుండా సాయిరెడ్డిని ఈరోజు బుక్ చేసింది. ఇంటింటికి మాస్కుల పంపిణీ అనేది ఒక స్కాం అని ఆరోపణలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఎందుకంటే 16 కోట్ల మాస్కులు తయారయ్యే సరికి లాక్ డౌనే ముగుస్తుంది. అయితే.. దీనిని కప్పిపుచ్చడానకిి ఈ నెల 14వ తేదీ సాయిరెడ్డి ఒక అబద్ధం చెప్పారు. మాస్కుల తయారీ పూర్తయ్యింది. దీనికి సహకరించిన డ్వాక్రా మహిళలకు వందనాలు అని చెప్పారు. కట్ చేస్తే వారం రోజుల తర్వాత ఏప్రిల్ 20న సాక్షి పత్రికలో ఒక ఆర్టికల్ వచ్చింది. దాని సారాంశం ఏంటో తెలుసా? మాస్కులు ఇంకా తయారవుతున్నాయి. మరో 9 రోజుల్లో మొత్తం తయారవుతాయి అని అందులో రాశారు. 

అంటే 14వ తేదీ సాయిరెడ్డి చెప్పింది అబద్ధం అని స్వయంగా సాక్షి పత్రిక నిరూపించింది. విజయసాయి రెడ్డి గాలిపోయింది. కానీ ఆయన ఇవేం పట్టించుకోరు. ఎందుకంటే అబద్ధాలు చెప్పడం ఆయన అలవాటు. ఎన్నికల ముందు కియా ప్లాంటు చైనాలో మూతపడింది దానికి దోచిపెట్టడం ఏంటి అన్నారు. ఎన్నికల తర్వాత దానిని జగన్ అక్కౌంట్లోకి వేశారు. 

మెడ్ టెక్ జోన్లో పెద్ద స్కాం అని 5 నెలల క్రితం గోల చేశారు. తర్వాత అది జగన్ వల్ల అద్భుతంగా పనిచేస్తుంది. కిట్లు భారీగా తయారవుతున్నాయి, బయట నుంచి కూడా భారీ ఆర్డర్లు వస్తున్నాయని అంటున్నారు. ఇలా పదేపదే జనానికి సాక్ష్యాలతో సహా దొరికినా సాయిరెడ్డి మారరు. ఫాల్స్ ప్రాపగండానే అజెండాగా పెట్టుకున్నపుడు నిజాలు ఎలా చెప్తారులే? !!