జనానికి తప్పుడు సంకేతాలు పంపుతున్న సాయిరెడ్డి

June 02, 2020

సాయిరెడ్డి చెప్పేవి శ్రీరంగనీతులే. కానీ చేసేవన్నీ చట్ట విరుద్ధమైన పనులే. జగన్ అంత గొప్పగా ఎవరూ దీనిని డీల్ చేయడం లేదని చెప్పే సాయిరెడ్డి ఏపీలో వాస్తవ పరిస్థితులను గమనించడంలో తీవ్రంగా విఫలం అవుతున్నారు. ఈరోజు నెల్లూరు జిల్లాలో 3 గ్రామాలు గుంపులుగా చేరి రాళ్లు రువ్వుకుని గొడవ పడ్డారు. రోజంతా గొడవలు జరిగినా ప్రభుత్వం నిమ్మకునీరెత్తినట్లు ఉంది. ఇంటర్నెట్ నిండా ఇవే వీడియోలే. ఏపీలే కేసులే లేవన్నారు... మంచి చెప్పి జాగ్రత్త పడమని చంద్రబాబు చెబితే పెడచెవిన పెట్టి కరోనా నివారణ పనులు చేయకుండా చంద్రబాబుపై పడి ఏడుస్తారు. 

ఇపుడు అన్న క్యాంటీన్లు ఉండుంటే... రాష్ట్ర వ్యాప్తంగా పేదలకు సులువుగా ఆహార సదుపాయం కల్పించేవాళ్లు. 

ఇపుడు ప్రజావేదిక ఉండుంటే... 2 వేల పడకల ఆస్పత్రిగా దానిని తయారుచేయడానికి పనికొచ్చేది. 

మెడ్ టెక్ జోన్ ను ఇగోతో నాశనం చేసి ఉండకపోతే... ఈ రోజు అది దేశానికి అవసరమైన వెంటిలేటర్లు, మాస్కులు, ఇతర వైద్య పరికరాలు అందించేది. 

అవగాహన రాహిత్యం, ప్రతిపక్షంపై అసూయ మినహా ప్రభుత్వం చేస్తున్నది ఏం లేదు. అసలు పరీక్షలే చేయకుండా ప్రజల ప్రాణాలను గాల్లో దీపంలా పెట్టారు. బియ్యం పంపిణీలో ఎక్కడా సామాజిక దూరం లేదు. మొన్నేమే వైద్యుల కోసం 4000 మాస్కులు తెప్పిస్తే... వాటిలో మూడు వేల మాస్కులను రాజకీయ నాయకులు పంచేసుకున్నారు. ఇళ్లలో ఉండే వీళ్లకి మాస్కులు అవసరమా? ప్రజలు ప్రాణాలు కాపాడే డాక్టర్లకు అవసరమా అన్న కనీస జ్జానం లేదు. ఇకతాజాా సాయిరెడ్డి చేసిన ఘనకార్యం అంతా ఇంతా కాదు... పావలా సాయం చేసి దానిని ప్రచారం చేసుకునే క్రమంలో లాక్ డౌన్ నిబంధనలు తుంగలో తొక్కారు. గుంపులు గుంపులుగా ఏర్పడి కరోనా వ్యాప్తికి స్వయంగా కారణమవుతున్నారు. ఇంత బాధ్యతరాహిత్యంగా వ్యవహరించబట్టే... ఇపుడు ఏపీలో కేసులు 300 దాటిపోయాయి. ఇప్పటికైనా రాజకీయాల మీద కాకుండా పని మీద దృష్టిపెట్టి... ముందు వైసీపీ నాయకులు సామాజిక దూరం పాటిస్తే ప్రజలు కూడా పాటిస్తారు.