ఆ నోటికి అడ్డే లేదు... కన్నా యజమాని బాబు అట

June 05, 2020

చంద్రబాబు ... విజయసాయిరెడ్డి కలలో కూడా వస్తున్నారు. చంద్రబాబును తలచుకోకుండా, విమర్శించకుండా, తిట్టకుండా విజయసాయిరెడ్డి ఒక్క రోజు కూడా ఉండలేరు. నిరంతరం చంద్రబాబును విమర్శిస్తే గాని చంద్రబాబు మీద అబద్ధాలు చెబితే జగన్ సమర్థుడు అని నిరూపించడం సాధ్యం కావడం లేదు. పోనీ అన్ని అబద్ధాలు చెప్పాక అయినా ప్రజలతో పేరు తెచ్చుకుంటున్నారా జగన్ రెడ్డి అంటే... అదీ లేదు. స్వేచ్ఛగా ఓటింగ్ పెడితే 20 శాతం పంచాయతీలు కూడా జగన్ ను ఆదరించే పరిస్థితి రాష్ట్రంలో కనిపించడం లేదు.

జగన్ అధికారంలోకి వచ్చిన పది నెలల్లో ఏపీలో లక్షలాది కార్మికులకు ఇసుక వల్ల కొంతకాలం, వరదల వల్ల కొంతకాలం, తాజాగా కరోనా వల్ల కొంత కాలం పనే లేదు. జగన్ రాజ్యంలో పేదోళ్ల పస్తులు అన్న సినిమా ఏపీలో నడుస్తున్నట్టుంది. ఇక ఎవరు జగన్ ను విమర్శించినా వారిని చంద్రబాబు మనుషులుగా చిత్రీకరిస్తున్నారు విజయసాయిరెడ్డి. చంద్రబాబు మాట వినేవాళ్లు అంతమంది ఉంటే అసలు బాబుఎందుకు ఓడిపోయేవాడు? సమస్యలేదు. తాజాగా రాష్ట్రాన్ని కరోనాని నుంచి కాపాడిన నిమ్మగడ్డ రమేష్ కుమార్ పై ముఖ్యమంత్రి తో సహా ఎన్ని నిందలు వేశారు? ఎన్ని బూతులు తిట్టారు? అన్నది అందరికీ తెలిసిందే. 

తాజాగా కరోనా నేపథ్యంలో కేంద్రం డబ్బులు తమవి అని చెప్పుకుంటారా? పైగా వాటిని వైసీపీ లోకల్ బాడీ ఎలక్షన్ల అభ్యర్థులతో పంచిపెడతారా ? అంటూ బీజేపీ ఏపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, సీపీఐ సీనియర్ నేత రామకృష్ణ విమర్శిస్తే... వారిని ఇపుడు చంద్రబాబు మనుషులుగా చిత్రీకరించారు విజయసాయిరెడ్డి. 

తలాతోకా లేకుండా సాయిరెడ్డి వేసిన ట్వీట్ చూడండి: 

ఇళ్ల నుంచి బయటకు వెళ్లలేక ఉపాధి కోల్పోయిన పేదలకు ప్రభుత్వం వెయ్యి ఎలా పంపిణీ చేస్తుందని కన్నా, సిపిఐ రామకృష్ణలు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కు ఫిర్యాదు చేసారు. వీళ్ల యజమానేమో ఐదు వేలివ్వమని రంకెలేస్తుంటాడు. రాజకీయాలు చేయడానికి ఇంత కంటే అనువైన సమయం దొరకలేదా మీకు? 

ఏపీలో ఎవరిని అడిగినా... బీజేపీ వైసీపీ స్నేహితులు అని చెబుతారు. మోడీకి బాబు అంటే పడదు అని ఏపీలో ప్రచారం జరుగుతోంది. ఏపీలో బీజేపీ నేతలు బాబుపై ఒంటి కాలిపై లేస్తూ తిడతారు. ఇపుడు పుసుక్కున సాయిరెడ్డి కన్నాను బాబు మనిషి అంటే కనీసం ఒక్కరైనా నమ్ముతారా? కానీ అబద్ధాలు అలవోకగా చెప్పడంలో వైసీపీ నేతలకు మించిన వారు ఈ ప్రపంచంలోనే లేరు.