తొందరపడి నోరు జారిన సాయిరెడ్డి... ఇలా బుక్కయ్యాడు

May 31, 2020

అధికారం మనదే కావచ్చు... నోరుంది కదా అని నచ్చింది మాట్లాడితే ఎపుడో ఒకపుడు దొరికిపోకుండా ఉండలేం. అయితే... ఎపుడో ఒకపుడు దొరకడం వేరు... రోజు అబద్ధమే చెబుతా ఎవడేం పీకుతాడు, పవర్ నా వద్ద అనుకోవడం వేరు. ప్రతిదానికీ ఒక ఎక్స్ పైరీ డేట్ ఉంటుంది. ఆ రోజు భారీగా ఉంటాయి రిగ్రెట్స్.  ఇదంతా ఎవరి గురించనుకుంటున్నారా... ఇంకెవరు ట్విట్టరు యూజర్స్ అసోషియేషన్ ఆఫ్ ఇండియా సంఘానికి అధ్యక్షుడు వంటి విజయసాయిరెడ్డి. నిరంతరం చంద్రబాబు, లోకేష్ నామస్మరణతో సగం రోజు గడిపేస్తూ ఉంటాడు సాయిరెడ్డి.

ముఖ్యమంత్రి అసమర్థత సోషల్ మీడియాలో చర్చకు రాకుండా నిత్యం చంద్రబాబు, లోకేష్ ను నామస్మరణ చేస్తూ టీడీపీ క్యాడరును అందులో  దానికి కౌంటర్లు వేయడంలో బిజీగా ఉంచడానికి సాయిరెడ్డి ట్రై చేస్తుంటారు. ఆ క్రమంలో ఈరోజు ఒక ట్వీటు పెట్టారు. హైదరాబాదులో ఖాళీగా ఉన్న టీడీపీ ఆఫీసును ఆస్పత్రిగా ఇస్తే తెలంగాణ ప్రజల రుణం తీర్చుకున్నట్లు అవుతుంది కదా, ఇలాంటి సమయంలో పెద్ద మనసు కనబరచాలి అంటూ చంద్రబాబుకు నీతులు చెప్పే ప్రయత్నం చేశాడు. 

దీనికి సోషల్ మీడియా ఓ రేంజ్ లో రియాక్టయ్యింది. ’అవునవును... జగన్ ఎలాగూ ముఖ్యమంత్రిగా అమరావతి ఇంట్లో ఉంటూ బిజీగా ఉన్నాడు కదా... ఇక్కడ ఖాళీగా ఉన్న లోటస్ పాండును, బెంగుళూరులో ఖాళీగా ఉన్న ప్యాలెస్ ను ఆస్పత్రిగా మారిస్తే చాలా బాగుంటుంది అంటూ రియాక్టయ్యారు. దీంతో సాయిరెడ్డి గొంతులో వెలక్కాయ పడినట్టయ్యింది. 

టీడీపీ నేత బుద్ధావెంకన్న కూడా దీనిపై స్పందించారు. ఎన్టీఆర్ ట్రస్టు భవన్ చాలా చిన్నది. అదెందుకు పనికి రాదు... అదే లోటస్ పాండ్ ఇంద్ర భవనం, బెంగుళూరు యలహంకలోని రాజప్రసాదం కరోనా ఆస్పత్రికి ఇస్తే... చాలా బాగుంటుంది. వాటిలో ఒక్కో దాంట్లో 100 గదులున్నాయి. పెద్ద ఆస్పత్రిగా మార్చొచ్చు. పైగా అత్యాధునిక సదుపాయాలతో వాటిని జగన్ కట్టించారు ఆస్పత్రికి ఇంకా బాగా పనికొస్తాయి అంటూ బుద్ధా వెంకన్న సాయిరెడ్డికి సలహా ఇచ్చారు.