నాలో నాతో వైఎస్సార్ ​85వ పేజీ ​- జగన్ అడ్డంగా బుక్కయ్యాడు

August 07, 2020
CTYPE html>
నాలో నాతో వైఎస్సార్ అంటూ విజయమ్మ రాసిన (?) పుస్తకం చదివిన ప్రతి ఒక్కరికి జగన్ తీరు తల్లి విజయమ్మకు ఏ మాత్రం నచ్చడం లేదా? ఆమెకు జగన్ పై పీకల దాకా కోపం ఏమైనా ఉందా?... అన్న కొత్త అనుమానాలను పెంచుతోంది. ఎందుకంటే ఆ పుస్తకం విడుదలయ్యాక అందులోని పలు పేజీలు జగన్ బండారం బట్టబయలు చేస్తున్నాయి. జగన్ పరువు తీస్తున్నాయి. చివరకు జగన్ రెడ్డి వాళ్ల నాన్నకి ఇచ్చిన మాటను తప్పినట్లు స్పష్టంచేస్తున్నాయి. 
రఘురామరాజు చెప్పినట్లు... జగన్ ఆ పుస్తకం చదవకుండా విడుదల చేశారని అర్థమైపోతుంది. జగన్ కనుక ఆ పుస్తకం చదివితే దాన్ని బయటకు రానిచ్చేవారు కాదని అర్థమవుతుంది. ఎందుకిలా జరుగుతుంది? అందులో ఏముందని చూస్తే... చిత్రమైన విషయాలు బయటపడుతున్నాయి.
ఆ పుస్తకంలోని 85వ పేజీలో 1996 ఎన్నికల సంఘటన గురించి విజయమ్మ రాసింది. ఆ ఎన్నికల్లో తండ్రి గెలిస్తే జీవితంలో తనకు ఎంతో ఇష్టమైన చికెన్ తినడం మానేస్తానని జగన్ మొక్కుకున్నాడట. వైఎస్సార్ గెలవడంతో ఆ రోజు నుంచి జగన్ చికెన్ తినడం మానేశాడట. తండ్రిపట్టుదలే జగన్ కి వచ్చిందని విజయమ్మ రాసుకొచ్చింది. 
చదివారు కదా... కింద రెండు వీడియోలు చూడండి.
 
 
ఈ వీడియోల చూశాక మీకు ఏమర్థమయ్యింది. తండ్రి చనిపోతే ఆయన ఫొటో వాడుకోవడం వేరు. కానీ చివరకు చికెన్ కి, మటన్ కి కూడా ఆయన ప్రస్తావన తెచ్చి చివరకి చికెన్ కథకి కూడా చనిపోయిన వైఎస్ సెంటిమెంట్ వాడితే వైఎస్ కుటుంబం హర్ట్ కాకపోయినా ఆయన అభిమానులు హర్టవుతారు కదా.  మరీ ఇంత వాడకమా? ఏం చెప్పినా ఖండించడానికి వైఎస్ లేరు అని ఇలా రాసేస్తే ఎలా?
 
మరి ఇది నిర్లక్ష్యమా? జగన్ పై కోపమా? ఎవరూ పట్టించుకోరు సెంటిమెంట్ రగులుతుందన్న ధైర్యమా? ఏంటో అర్థం కాని పరిస్థితి. పై వీడియోల్లో చూశారుగా జగన్ నాటుకోడి పులుసు లేకుండా ఉండలేరట. మంచి భోజన ప్రియుడట. అందులో తప్పేం లేదు. కొడుకు జగన్ రెడ్డికి డ్యామేజ్ చేస్తుందని తెలియక రాసిందా? లేకపోతే కోపంతో విజయమ్మ అలా రాసిందా అన్నది అర్థం కావడం లేదు.