పచ్చిఅబద్ధం చెప్పి సాక్ష్యంతో దొరికాడు

January 24, 2020

విజయసాయిరెడ్డి... వైసీపీకి ఎంత బలమో అంత బలహీనత. ఆయన ఫోర్స్ లో చేసే ప్రచారం ప్రతిపక్షంలో ఉన్న వైసీపీకి బాగానే ఉపయోగపడ్డాయి గాని అధికారపక్షంలో ఉన్నపుడు జగన్ ను ఇబ్బంది పెడుతున్నాయి. తాజాగా పోలవరం అంచనాల విషయంలో విజయసాయిరెడ్డి చేసిన తప్పు జగన్ మెడకు చుట్టుకునేలా ఉంది.

చంద్రబాబు ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టుపై సవరించిన అంచనాలను కేంద్రానికి పంపింది. వాటిని ఫిబ్రవరి 2019లో కేంద్రం ఆమోదించింది. అయితే ఈ విషయాన్ని వారం కిందట వరకు తొక్కిపెట్టింది. తాజాగా బయటకు వచ్చిన ఈ విషయాన్ని నారా లోకేష్ నిన్న ప్రస్తావిస్తూ... ‘‘అవినీతి చేశారు... అంచనాలు పెంచారు అని వైసీపీ, బీజేపీ అంటున్నాయి... మరి కేంద్రం సవరించిన అంచనాలనే ఆమోదించింది. అవినీతి ఎక్కడుందో చెప్పండి. లేదా అబద్ధాలు చెప్పడం మానేసి మిగిలిన పోలవరం పనులు పూర్తి చేయండి’’ అంటూ లోకేష్ ట్వీట్ చేశారు. 

అయితే, విజయసాయిరెడ్డి విషయాన్ని తప్పు దారి పట్టించే ప్రయత్నం చేశారు. జగన్మోహన్ రెడ్డి మోడీని అడిగితే దానికి స్పందన గా కేంద్రం సవరించిన అంచనాలు ఆమోదించిందట. ఇది ఎంత పచ్చిఅబద్ధం అంటే... జగన్ ముఖ్యమంత్రి అయింది మే 23 తర్వాత. అంచనాలు ఆమోదించింది ఫిబ్రవరిలో...!! అబద్ధం చెబితే నమ్మేలా ఉండాలి కదా. మరీ ఇంత అడ్డగోలుగా అబద్ధాలు చెప్పి జగన్ కు సాయిరెడ్డి ముప్పు తెచ్చేలా కనిపిస్తున్నాడు.

ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఉంది. కొత్తగా జగన్ ప్రభుత్వం హడావుడిగా కేంద్రానికి అంచనాలు పంపింది. పోలవరం క్రెడిట్ తమ ఖాతాలో వేసుకోవడానికి ఈ అంచనాలు పంపింది. వీటినే ఆమోదించి ఉంటారన్న ఆశతో పంపిన రెండు రోజుల్లో సాయిరెడ్డి రాజ్యసభలో ఓ ప్రశ్న అడిగారు. వాస్తవానికి సాయిరెడ్డి ఎక్స్ పెక్ట్ చేసింది ఏంటంటే... వీళ్ల అంచనాలు ఆమోదించి ప్రకటిస్తారేమో అని.

కానీ సీన్ రివర్సయ్యింది. అప్పటికే బీజేపీ ప్రభుత్వం ఫిబ్రవరిలోనే సవరించిన అంచనాలు ఆమోదించింది. వాటిని తాజాగా ప్రకటించింది. అంతకుముందే ఆమోదించిన విషయం వైసీపీకి, టీడీపీకి ఇద్దరికీ తెలియదు. తీరా ఇపుడు వాటిని బయటపెట్టారు. రాజ్యసభలో దీనిపై ప్రకటన చేసిన తర్వాత అందరికీ తెలిసింది.

ఇదిలా ఉంటే జగన్ ప్రభుత్వం పంపిన కొత్త అంచనాలు అసంపూర్తిగా ఉన్నాయిని వాటిని ఆమోదించడానికి ఎట్టి పరిస్థితుల్లోనూ కుదరదని కేంద్రం తేల్చి చెప్పింది. అయినా, జనాలు ఎవ్వరూ పేపరే చదవరు అన్నట్టు సాయిరెడ్డి అబద్ధం చెప్పి దొరికిపోయాడు. ఆయన ఏం చెప్పాడో మీరే చూడండి.

పోలవరం అంచనాల ఆమోదం, నిధుల గురించి వైఎస్ జగన్ గారు ప్రధానిని కలిసినప్పుడు కోరారు.దానికి స్పందనగానే రూ.55,548 కోట్ల సవరించిన అంచనాకు గ్రీన్ సిగ్నల్ దొరికింది.ఇది తన తండ్రి కష్టానికి ఫలితమని లోకేష్ డప్పుకొట్టు కోవడం ఆపాలి.ఖర్చు చేసిన నిధులకు లెక్కలు చూపకుండా మొండికేసిన చరిత్ర మీది.

చంద్రబాబు ప్రభుత్వం పంపిన అంచనాలు ఆమోదిస్తే తమ అంచనాలు ఆమోదించినట్లు సాయిరెడ్డి ప్రచారం చేస్తున్నారు. ఇందులో ఏమైన అనుమానం ఉంటే కింద ఇచ్చిన అఫిషియల్ డాక్యుమెంట్లో అంచనాలు ఎపుడు ఆమోదించిందీ స్పష్టంగా ఉంది. కింద చిత్రంలో చూడొచ్చు.