మోడీ హ్యాండిచ్చాడు... సాయిరెడ్డి పులకించారు

July 08, 2020

ప్రధాని నరేంద్ర మోడీకి కట్టప్ప ఎవరో తెలుసా?...  వైసీపీ నెం.2 విజయసాయిరెడ్డి. ఆయనంటే మోడీకి ఎంతో ఇష్టం. ఆ అండదండల వల్లే చంద్రబాబుపై పచ్చి బూతులు వాడుతూ ఉంటారు సాయిరెడ్డి. ఈయన చెప్పుకోవడానికి వైసీపీలో నెం.2 యే గాని బీజేపీ ఎంపీలు కూడా  చూపనంత భయభక్తులు మోడీ పట్ల చూపుతుంటారు.

తాను ఈ అలవాటును జగన్ రెడ్డికి కూడా నేర్పారు. మొన్న రేణిగుంట ఎయిర్ పోర్టులో జగన్ పాదనమస్కార విన్యాసాలను చూసి తరించాం కదా. ఎవరైనా నాలుగ్గోడల మధ్యన తలొగ్గడం సాధారణంగా జరిగేదే కానీ... తన బానిసత్వాన్ని బహిరంగంగా చూపుకోవడమే కాకుండా గర్వంగా చెప్పుకునే ఏకైక వ్యక్తి విజయసాయిరెడ్డి. ఆయన వేసిన తాజా ట్వీటు చూస్తే ఈ విషయం స్పష్టంగా అర్థమవుతుంది.

ఈరోజు ఢిల్లీలో అఖిలపక్ష సమావేశం అనంతరం ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ బయటకు వెళుతూ లాబీలో శ్రీ వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి గారి కోసం నిరీక్షిస్తున్న నన్ను చూసి 'హాయ్ విజయ్‌ గారు' అని పలకరిస్తూ నావైపుకు అడుగులు వేసి నాతో కరచాలనం చేశారు. ఊహించని ఈ ఘటన నా జీవితంలో ఒక మధుర జ్ఞాపకం.