బీజేపీ PLAN B: ఆంధ్ర పళని స్వామి సాయిరెడ్డి

July 03, 2020

నెలరోజుల్లో రాజకీయం మారిపోయింది. ఆంధ్రా రాజకీయం ఊహించని మలుపులు తిరుగుతోంది. సరిగ్గా ఎన్నికలకు ఆర్నెల్ల ముందు వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి మోడీకి బాగా దగ్గరయ్యారు. బీజేపీని మచ్చిక చేసుకునే తెలివితేటలు సడెన్ గా జగన్ ఎలా వచ్చాయనుకున్నారా? ఆయనకి లేవు. మరి ఆయనకు మోడీతో సంబంధాలు ఎలా ఏర్పడ్డాయి అని మీ అనుమానా? దీనివెనుక ఓ వ్యక్తి ఉన్నారు. ఈ పనంతా చేసి పెట్టింది ఆ పార్టీ ఆయువు పట్టుగా ఎదిగిన వి.విజయసాయిరెడ్డి. ప్రశాంత్ కిషోర్ తో డీల్ కుదర్చడం వెనుక కూడా విజయసాయిరెడ్డి హస్తం ఉంది. ఎవరి బలం, తెలివితేటలు, వ్యూహాలతో జగన్ ముఖ్యమంత్రి అయ్యారో... ఇపుడు అతని వల్లే జగన్ కి జీవితంలో కోలుకోలేని దెబ్బ తగులుతోందని ప్రచారం జరుగుతోంది. ఇది నమ్మశక్యంగా లేదు కదా. కొంచెం చరిత్ర తెలుసుకుంటే భవిష్యత్తు మీకు స్పష్టంగా అర్థమవుతుంది.

ఏడాది క్రితం మాట. ఎన్నికల ముందు మోడీతో సహా అందరూ సంకీర్ణమే వచ్చేది అని నమ్మారు. ఆ ఉద్దేశంతోనే జగన్ మోడీతో కలిశారు. మోడీ కూడా భవిష్యత్తు అవసరాల కోసమే జగన్ ను చేరదీశాడు. ‘‘తాను అధికారంలోకి రావడం ఖాయం, మోడీ ప్రధాని అయ్యాక సంకీర్ణంలో తన అవసరం ఉంటుంది కాబట్టి మోడీ నా చేతిలో ఉంటాడు, మోడీ చేతిలో తాను ఉండను’’ అని జగన్ ఊహించాడు. కట్ చేస్తే అనూహ్య ఫలితాలు వచ్చాయి. ఇపుడు మోడీ అత్యంత శక్తిమంతుడు అయ్యాడు.
ఫలితాల అనంతరం జగన్... ఢిల్లీ వెళ్లి మోడీని కలిసినపుడు మోడీ ప్రత్యేక హోదా మరిచిపొమ్మని జగన్ కి చెప్పారట. అపుడు సరే అని జగన్ బయటకు వచ్చి మళ్లీ ప్రత్యేక హోదా ప్రస్తావన తేవడం మోడీ టీంకి నచ్చలేదట. వాస్తవానికి అందరూ అనుకున్నట్లు ఏపీలో బీజేపీ టార్గెట్ 2029 కాదు. మారిపోయింది. దీనికి కారణం జగనే. 2029 కంటే ముందే బీజేపీకి అవకాశం రావడంతో ప్లాన్ మారింది. ఇపుడు జగన్ విజయసాయిరెడ్డి మీద జగన్ పూర్తిగా డిపెండ్ అయ్యాడు. ఎంత ఆధారపడ్డాడు అంటే ఒక్క విజయసాయికే 6 పదవులు ఇచ్చాడు. సాయిరెడ్డి ఏం చెబితే పార్టీలో అది జరగాల్సిందే. అసలు సాయిరెడ్డి వేరు, పార్టీ వేరు. సాయిరెడ్డి పేరుకు వైసీపీయే గాని అతను మోడీ మనిషి. ఆ ధైర్యంతోనే అధికారం వస్తుందో రాదో తెలియకపోయినా చంద్రబాబుపై ఆ స్థాయిలో విరుచుకుపడ్డారు. అంటే ఏదయినా జరిగితే మోడీ అండ ఉంది అన్నది సాయిరెడ్డి ధైర్యం. అపుడు వరంలా మారిన ఆ సాయిరెడ్డే జగన్ కు ఇపుడు శాపంగా మారాడు. కాదు కాదు... బీజేపీ మార్చింది. ఈ మేరకు తెలుగు పొలిటికల్ సర్కిల్ లో ఓ వార్త చక్కర్లు కొడుతోంది.
తమిళనాడులో జయలలిత మరణించినపుడు ఏం జరిగిందో తెలుసు కదా. యాజిటీజ్ ప్లాన్ ఇక్కడ అమలవుతుందని అంటున్నారు. జగన్ పై ఉన్న కేసులతో బీజేపీ జగన్మోహన్ రెడ్డిని జైలుకు పంపుతుంది. (వాస్తవానికి అతని జాతకంలోనూ ఈ ప్రాప్తం ఉందంటున్నారు.) ఆ క్రమంలో విజయసాయిరెడ్డిని బీజేపీ వెనకుండి నడిపించి ముఖ్యమంత్రిని చేస్తుంది. వైసీపికి కూడా వేరే ఆప్షన్ లేదు. అసలు జగన్ జీవితమే సాయిరెడ్డి చేతుల్లో ఉంది. సాయిరెడ్డి నోరు విప్పితే ఎన్నటికీ జగన్ బయటకు రాలేడు. వైసీపీ ఉండేది జగన్ పేరు మీద, ప్రభుత్వం నడిపేది విజయసాయిరెడ్డి... నడిపించేది కేంద్రంలోని బీజేపీ. ఒక్కమాటలో చెప్పాలంటే... విజయసాయిరెడ్డి ఆంధ్రా పళని స్వామి. శశికళను జైలుకు పంపి పళని స్వామిని ముఖ్యమంత్రిని చేసి బీజేపీ ఎలా ఆడిస్తుందో అలాగ ఇక్కడ జగన్ ను విజయసాయిరెడ్డిని వేరు చేసి బీజేపీ చట్రం తిప్పుతుంది.
ఈ సంచలన ప్లానింగ్ రెండు రోజుల నుంచి తెగ వైరల్ అవుతోంది. పరిస్థితులు చూస్తుంటే కూడా అలాగే ఉన్నాయి. పైగా బీజేపీ విషయంలో జగన్ తీరు బాలేదు. మోడీ మాట వింటాడు అనుకుంటే క్రిస్టియానిటీ విషయంలో గాని, మత మార్పిడుల విషయంలో గాని, కేంద్రం నిర్ణయాల విషయంలో గాని బీజేపీ ఆలోచనలకు అనుగుణంగా జగన్ నడుచుకోకపోవడంతో బీజేపీ మోడీ షా బృందం... జగన్ విషయంలో ప్లాన్ మార్చింది. మరి దీనిని జగన్ ఎలా ఎదుర్కొంటాడు? అన్నది చూడాలి. వ్యాపారమైనా, రాజకీయమైనా ఇంకొకరి మీద ఆధారపడితే పరిస్థితి ఇలాగే ఉంటుంది. మరి ఇందులో ఎంత వాస్తవం ఉంది, లేకపోతే ప్రచారమేనా? లేకపోతే జగన్ రాజీ చేసుకుంటారా?  అన్నది కాలమే చెప్పాలి.