పిల్లల గురించి విజయశాంతి వెల్లడించిన నిజం

August 08, 2020

విజయశాంతి... తెలుగు కమర్షియల్ సినిమాల్లో చరిత్ర సృష్టించిన హీరోయిన్. అత్యధిక హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాలు తీసిన కథనాయక కూడా ఆమే. చాలామందికి ఆమె భర్త పేరు తప్ప అతను ఎవరో, ఎలా ఉంటారో తెలియదు. ఆయన తో పాటు ఆమె ఎపుడూ కనిపించదు. అసలు ఆమె అతనితో కలిసి ఉందో లేదో కూడా తెలియని నేపథ్యంలో ఇన్నాళ్లకు స్వయంగా ఆమె నోటి నుంచి భర్త వివరాలు బయటకు వచ్చాయి.
తనకు 17 ఏళ్లపుడు తండ్రిని కోల్పోయింది. 18 ఏళ్లపుడు తల్లిని కోల్పోయింది. అందుకే బహుశా తనకు దొరికిన భర్తను ఎవరి కంట పడకుండా అపురూపంగా దాచుకుంది. అయితే, ఒక ఆంగ్ల పత్రిక మాత్రం ఢిల్లీలో ఓసారి వారిద్దరిని కలిసిన ఫొటో దొరకబుచ్చుకుందట. దానిని హీరోయిన్లు తమ అందమైన భర్తలను ఎందుకు దాచిపెడతారో అని క్యాప్షన్ పెట్టి రాసిందట. అపుడు తప్ప ఎపుడూ ఆమె భర్త ఏ మీడియా కంటా పడలేదు. మరి ఎవరాయన ఏమిటా సంగతులు అంటే... ఇదిగో... ఇక్కడ చదవండి.
‘‘18 ఏళ్లపుడే తల్లిదండ్రులను కోల్పోయిన నాకు కెరియర్ అయితే బ్రహ్మాండంగా ఉంది గాని జీవితం మాత్రం శూన్యంగా అనిపించేది. ఇంటికొస్తే.. తిన్నావా? బాగున్నావా ? అని అడిగేవారు లేరు. అలాంటి సమయంలో నిర్మాత అయిన శ్రీనివాస్ ప్రసాద్‌ పరిచయమయ్యారు. నా కెరీర్లో మైలురాయిలా నిలిచిన ‘కర్తవ్యం’ ప్రొడక్షన్లో కీలకంగా ఉండేవారు. ఆయనతో సాన్నిహిత్యం పెరిగింది. చాలా దగ్గర మనిషిలా అనిపించాడు. నాకు చాలా మంచి భర్త దొరికాడు. ఆయన చాలా సింపుల్‌. ఆర్బాటాలకు దూరం. అందుేక 1988 మార్చి 29న తాము రిజిస్టర్‌ మ్యారేజ్‌ చేసుకున్నాం. పెళ్లయ్యి 32 ఏళ్లయింది. పిల్లలు లేరు కానీ హాయిగా బతుకుతున్నాం. పిల్లల వల్ల స్వార్థం పెరుగుతుంది. ప్రజలు, అభిమానులే పిల్లలుగా బతుకుతున్నాను. నాకు ఏ లోటు లేదు’’ అని ఉద్వేగ పూరితంగా వివరించారు.