భయంకరమైన పరిస్థితిలో విజయవాడ  !!

May 31, 2020

హైదరాబాదు మహానగరం... ఇక్కడ ఎవరెవరో ఉంటారు. సొంతూరుకు వెళ్లి జాగ్రత్తగా ఉందాం అని భరోసాగా ఊర్లకు వెళ్లిన ఏపీ ప్రజలను ఆ ప్రభుత్వం గాలికొదిలేసింది. ఈ నేపథ్యంలో దేవుడా ఎందుకు హైదరాబాదును వచ్చేశాం అని ఫీలయ్యే పరిస్థితి తెచ్చారు ఏపీ ముఖ్యమంత్రి జగన్. తాజాగా ఈరోజు విజయవాడ పోలీస్ కమిషనర్ ద్వారకా తిరుమలరావు చేసిన ప్రకటన ఏపీలో కరోనా మూడో దశలోకి (కమ్యూనిటీ ట్రాన్స్ మిషన్ ) వెళ్లిందని అధికారికంగా కన్ ఫం చేసి నట్లు అయ్యింది.

కమిషనర్ ఏమన్నారంటే.. విజయవాడలో పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ప్రజలను భయపెట్టడానికి ఈ మాట చెప్పడం లేదు. నగరంలో కొన్ని పాజిటివ్ కేసులకు సోర్స్ తెలియడం లేదు. పరిస్థితులను అర్థం చేసుకోండి. మాకేం కాదనే భావనతో ప్రజలెవరూ బయటకు రావొద్దు. ఒకవేళ అనవసరంగా రోడ్డు మీదకు వస్తే ఇక క్రిమినల్ కేసులు పెడతాం. బయటకు వచ్చి కేసుల్లో ఇరుక్కోవద్దు‘‘ అని ద్వారకా తిరుమ రావు ప్రజలకు డైరెక్ట్ వార్నింగ్ ఇచ్చారు. ఆయన మాటలే ఏపీ మూడో దశలో ఉందని ధృవీకరించాయి.

ఏపీ దేశంలోనే అత్యధిక రెడ్ జోన్స్ ఉన్న రాష్ట్రం. శ్రీకాకుళం, విజయనగరం తప్ప మిగతా ఏపీ అంతా కేంద్రం ప్రకటించిన రెడ్ జోన్లోనే ఉంది. అంటే మే 3వరకు ఏపీలో ఎలాంటి లాక్ డౌన్ సడలింపులు ఉండవు అని అర్థమవుతోంది. ఏపీలో సరుకులకు కూడా కష్టమవుతోంది. ఏపీ సర్కారు చర్యలు కరోనా వ్యాప్తికి కారణం అవుతున్నాయి. మార్కెట్ల సమయం తగ్గించడం వల్ల టైం అయిపోతుందన్న తొందరలో జనం సామాజిక దూరాన్ని మరిచి ఒకర్నొకరు తోసుకుంటున్నారు. మరోవైపు ఏపీ వ్యాప్తంగా వైసీపీ నాయకులు గుంపుగుంపులుగా గుమిగూడి ఫుడ్ ప్యాకెట్లు పంచుతున్నారు. పబ్లిసిటీ పిచ్చిలో ప్రజలను పెద్ద సంఖ్యలో పిలిచి వారిలో వారికి వ్యాధి వ్యాప్తి పెరిగడానికి కారణం అవుతున్నారు. ఎన్ని విమర్శలు వచ్చినా ఏపీ నాయకులు మారడం లేదు.