విజయవాడ కమిషనర్ పై జగన్ కు కోపమొచ్చిందా?

August 15, 2020

విజయవాడ... ఏపీ రాజకీయ రాజధాని. రాజకీయాలకే కాదు, నేరాలకు, సినిమాలకు కూడా అదే రాజధాని. నిరంతరం వార్తల్లో నిలిచే విజయవాడ పోలీసు కమిషనర్ పదవి చాలా కీలకం. ఇక్కడకు వచ్చే ప్రతి పోలీసు కమిషనర్ కొన్ని కీలకమైన కేసులను డీల్ చేయకుండా పోడు. ఎందుకంటే ఏదో ఒక విషయంతో రగిలిపోతుంటుంది విజయవాడ. 

తాజగా పండు - సందీప్ గ్యాంగ్ వార్ లో ఎన్ని మలుపులున్నాయో చూశాం కదా. ఇలాగే ఉంటుంది. అయితే, తాజాగా ఏపీలో ఐపీఎస్ ల బదిలీలు చేశారు. ఎందుకో మరి జగన్ కి విజయవాడ పోలీసు కమిషనర్ మీద కోపం వచ్చింది. ఏం జరిగిందో తెలియదు గాని... అతను తీసి ఎవరూ కోరుకోని రైల్వే డీజీపీ పోస్టు ఇచ్చాడు. ఇతను రెండున్నరేళ్లుగా ఇక్కడే పనిచేస్తున్నారు. 

దీంతో విజయవాడకు కొత్త బాస్ వచ్చారు. ఆయన పేరు బి.శ్రీనివాసులు. ట్విస్ట్ ఏంటంటే... ఇతను గతంలో ఆల్రెడీ ఒకసారి విజయవాడ కమిషనర్ గా చేశారు. బాబు హయాంలో కాదు... ఉమ్మడి రాష్ట్రంలో ఇతను విజయవాడ పోలీసు బాస్. మళ్లీ ఇంతకాలానికి అదే పోస్టులోకి వచ్చాడు.

సాధారణంగా ఇలా గతంలో చేసిన పోస్టుల్లోకి చాలా మంది తిరిగి రావడానికి ఒప్పుకోరు. అలాంటి ఆయన ఇక్కడకు వచ్చారంటే... ముఖ్యమంత్రి జగన్ వ్యక్తిగత ఇన్వాల్వ్ మెంట్ కచ్చితంగా ఉండే అవకాశం ఉంది.

కొత్త కమిషనర్ శ్రీనివాసులు పాత కమిషనర్ కంటే పదేళ్లు జూనియర్ కావడం గమనార్హం.