ఒక్కమాటతో... హీరో రియల్ హీరో అయ్యారు

August 08, 2020

నువ్వు కోటీశ్వరుడు అయినా... నీ తల్లి దండ్రి అవసాన దశలో ఉన్నపుడు వారికి ఊపిరి పోసేది నీ ధనం కాదు. అమ్మా తిన్నావా? అన్న ప్రేమ. తాత, బామ్మ అని నీ పిల్లలు పిలిచే పలకరింపు. ఇవి లేకుండా నువ్వు రోజుకో నోట్ల కట్ట పంపినా వారి ఆరోగ్యం కుదురుగా ఉండదు. ప్రేమగా పలకరిస్తూ పప్పన్నం పెట్టినా... సంతోషంగా జీవిస్తారు. అంటే జీవితంలో ఏ కీలక సందర్భంలోను డబ్బుకు విలువ ఉండదు. అవును అంతా సాధారణంగా ఉన్నపుడే డబ్బుకు విలువ. 

ఎంత మంది హీరోలు ఎన్ని కోట్లు అయినా విరాళాలు ఇచ్చి ఉండొచ్చు. పెద్ద పెద్ద కంపెనీలు ఎంతో నిధులు గుమ్మరించి ఉండొచ్చు. కానీ కరోనా వేళ తమిళ మాజీ హీరో, రాజకీయ నాయకుడు విజయకాంత్ చూపిన ఉదారత ఎన్నటికీ మరువలేనిది. తాజాగా పలుచోట్ల శ్మశానాల్లో కరోనా మృతులను ఖననం చేయనివ్వడం లేదు. మా ఏరియాకి కరోనా వస్తుంది వారిని ఇక్కడ కాల్చినా, పూడ్చినా... కాబట్టి.. మా వద్ద దహనం వద్దు, ఖననం వద్దు అంటూ నిర్దయగా స్థానికులు వ్యతిరేకిస్తున్నారు. దేశంలో పలుచోట్ల ఇదే జరుగుతోంది. ఇది విజయ్ కాంత్ ను కదిలించింది. వెంటనే ఒక నిర్ణయం తీసుకున్నారు. కరోనా మృతులకు తన కాలేజీ గ్రౌండును శ్మశానంగా వాడుకోమని ప్రభుత్వానికి చెప్పాడు. ఇంతకుమించిన గొప్ప ఉదారత ఏముంటుంది. 

కోట్లు విరాళం ఇవ్వడం కంటే కూడా విజయ్ కాంత్ చూపిన ఉదారత గొప్పది.  విజ‌య్‌కాంత్‌కు చెన్నై శివార‌ల్లో ఆండాళ్‌ అళగర్ పేరుతో ఇంజినీరింగ్‌ కళాశాల ఉంది. దీనికి పక్కనే పెద్ద గ్రౌండ్ ఉంది. అందులో కొంత క‌రోనా మృతుల ఖ‌న‌నానికి ఇస్తాన‌ని విజ‌య్ కాంత్ ప్ర‌క‌టించారు. కరోనాతో మృతి చెందిన వారిని ఖననం చేస్తే దానివల్ల ఎవరికీ వైరస్ రాదన్నారు. ఇది ప్రజలకు ప్రచారం చేయానలి ప్రభుత్వాన్ని కోరారు. తాజా నిర్ణయంతో  విజ‌య్ కాంత్ పై ప్ర‌శంస‌ల జ‌ల్లు కురుస్తోంది. పవన్ కళ్యాణ్ కూడా ‘‘ఈ నిర్ణయం తీసుకున్న విజయ్ కాంత్ ది గొప్ప వ్యక్తిత్వం‘‘ అని ప్రశంసించారు.