విజయసాయిరెడ్డి కి పాజిటివ్ : వాస్తవానికి - పబ్లిసిటీకి ఇదే తేడా

August 08, 2020

కొన్ని సంఘటనలు యాదృచ్ఛికంగా జరుగుతుంటాయి. కానీ అవి కొందరికి గుణపాఠాలు నేర్పుతాయి. తాజగా అలాంటి గుణపాఠం ఒకటి వైసీపీ నేత విజయసాయిరెడ్డికి ఎదురైంది.

7 జులై 2020, విజయసాయిరెడ్డి ట్వీటు :

ఆరోగ్యంగా గుండ్రాయిలా ఉన్నా ఈ డ్రామాలేంటి అచ్చన్నా...కార్పరేట్ ఆస్పత్రే కావాలా? ఏం ఈఎస్ఐ ఆస్పత్రి వద్దా? మీ సీబీఎన్ హయాంలా కాదు, జగన్ గారి ప్రభుత్వం. ఆస్పత్రులకు అన్ని హంగులు అద్దింది. సమస్య వస్తే చూసుకుంటుంది.

21 జులై 2020, వైసీపీ బాకా వెబ్ సైట్ వేసిన ట్వీట్ :

వైసీపీ ప్రముఖ నేత విజయసాయిరెడ్డికి కరోనా పాజిటివ్. హైదరాబాదులోని తన ఇంటి దగ్గరున్న అపోలో ఆస్పత్రిలో చేరిక.

మరి జగనన్న హంగులు దిద్దిన ఆస్పత్రులు...

డిప్యూటీ సీఎం కు నచ్చలేదు

ఎమ్మెల్యేకు నచ్చలేదు

చివరకు జగన్ దేవుడు అనే విజయసాయిరెడ్డికి నచ్చలేదు

మరి ఆ ఆస్పత్రుల్లో హంగులున్నాయని చెప్పింది అబద్ధమా? హంగులు లేవు అన్నది నిజమా?

..........

ఇక మరో కోణం ఏంటంటే... అచ్చన్న తప్పులు, ఒప్పులు, స్కామ్ గురించి కోర్టులు తేల్చాల్సిన విషయం పక్కనపెడితే. సాటి మనిషికి ఆపరేషన్ చేశారు. అతను కోలుకోవాలని కోరుకోకుండా ఎలాంటి ట్వీట్ వేశారో పైన చూశాం.

మరి ఈరోజు సాయిరెడ్డికి కరోనా వస్తే టీడీపీ నేతలు బుద్ధా వెంకన్న, అనిత వంగలపూడి ఏం ట్వీట్స్ వేశారో తెలుసా?

Anitha Vangalapudi : రాజకీయంగా విభేదించినా ఈ కరోనాకి అందరం ఒకటే. మీరు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను @vsreddy_mp  గారు.

​Budda Venkanna : రాజకీయంగా ట్విట్టర్ ప్రత్యర్థులమే తప్ప వ్యక్తిగతంగా మా మధ్య ఎటువంటి గట్టు తగాదా లేదు. ఎంపీ @VSReddy_MP గారు కనికరం లేని కరోనా బారిన పడటం బాధాకరం.ఆయన కరోనా నుండి త్వరగా కోలుకుని ట్విట్టర్ లో యాక్టివ్ అవ్వాలని ఆ దేవుడిని కోరుకుంటున్నాను.​

​సాటి మనిషికి బాగోలేకపోతే ఇది మానవత్వంతో స్పందించాల్సిన తీరు. ​