వికాస్ దూబే... ఎవడీ క్రిమినల్, ఎందుకంత పాపులర్ ?

August 09, 2020

నిన్నటి నుంచి ఒక వార్త మోగిపోతోంది. ఎక్కడ చూసినా అదే. 

మోస్ట్ వాంటెడ్ క్రిమినల్, గ్యాంగ్ స్టర్ వికాస్ దూబే అనుచరుల ఎన్ కౌంటర్.

వికాస్ దూబే కోసం వేట అంటూ వినిపించాయి. తాజాగా అతను కూడా అరెస్టయ్యాడు. ఎవడీ దూబే... ఏం చేశాడు? తెలుసుకుందాం.

కాన్పూర్‌లో  8 మంది పోలీసులను దారుణంగా హత్య చేసినందుకు కేసు నమోదైంది.

ఇందులో ప్రధాన నిందితుడు వికాస్ దూబే. ఇతను పేరు మోసిన రౌడీ.

ఇతనిపై అనేక పోలీస్ స్టేషన్లలో లెక్కలేనన్ని కేసులు నమోదయ్యాయి.

యూపీలోని బికారు ప్రాంతానికి చెందిన వాడు. వికాస్ పండిట్ ఇతని అసలు పేరు.

హత్యలు, కిడ్నాప్, రాబరీలు, భూకబ్జాలు చేయడం ఇతను వృత్తిగా పెట్టుకున్నాడు. మరింత చేశాక... ఊరికే ఉంటాడా... రాజకీయాల్లోకి కూడా వచ్చాడు. 

వికాస్ దూబేపై 1990లో తొలి క్రిమినల్ కేసు నమోదైంది. మూడు దశాబ్దాల్లో అతనిపై 60 క్రిమినల్ కేసులు నమోదయ్యాయి.

2001లో బీజేపీ మంత్రి సంతోష్ శుక్లాని ఒక పోలీస్ స్టేషన్లోనే చంపేశారు. ఈ హత్యలో ప్రధాన నిందితుడు వికాస్ దూబే.

మంత్రిని చంపినా అతను తప్పించుకోలిగిగాడు... మొన్న జులై 3న అతను చేయకూడని తప్పు చేశాడు. పైగా యోగి రాజ్యంలో ! అసలే క్రిమినల్స్ ను ఎన్ కౌంటర్ చేయించడమే పరమావధిగా కొనసాగుతున్న యోగి హయాంలో ఏకంగా డీసీఎస్పీతో కలిపి ఎనిమిది మంది పోలీసులను చంపేశాడు.

కాన్పూర్ నగరంలో జరిగిన ఈ దుర్ఘటనలో మరో 7గురు పోలీసులు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో యోగి వికాస్ దూబేను టార్గెట్ చేశారు.

యోగి ఆదేశాలంతో 25 పోలీసు టీంలను దూబేను పట్టుకోవడానికి ఏర్పాటుచేశారు. ఈ బృందాలు పలు రాష్ట్రాల్లో విస్తరించి వేట మొదలుపెట్టాయి.

చివరకు మధ్యప్రదేశ్ లోని ఉజ్జయినిలో అతన్ని అరెస్టు చేశారు. మహాకాళి టెంపుల్ వద్ద అతన్ని అరెస్టు చేశారు.

వికాస్ దూబేను అరెస్టు చేసిన సందర్భంగా మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పోలీసులను అభినందించారు.

వికాస్ దూబే  ఇంతలా ఎదగడానికి రాజకీయాలు, పోలీసులే కారణం. మొదట్లో బీజేపీ, బీఎస్పీలలో చేరినా... తర్వాత ఏ పార్టీతోను అనుబంధంగా లేకుండా అన్ని పార్టీలతో సంబంధాలు నెరిపాడు. రహస్య శక్తిగా ఎదిగాడు.

ఇటీవల ఆయన భార్య మాత్రం సమాజ్ వాదీ పార్టీ పేరు చెప్పుకుని స్థానిక ఎన్నికల్లో గెలిచింది.

ఆమె మా పార్టీ కాదని ఎస్పీ అధినేతలు ఖండించారు.

ఇప్పటికే వికాస్ దూబే పలువురు అనుచరులను పోలీసులు చంపేశారు.

తాజాగా దూబేనె అరెస్టు చేసి పోలీసుల అదుపులో ఉంచారు.