వికాస్ దూబే ఎన్‌కౌంటర్.. చివరి నిమిషంలో ఏం జరిగింది

August 08, 2020

Vikas Dubey తనను అరెస్ట్ చేయడానికి వచ్చిన పోలీసులపై కాల్పులు జరిపి 8 మంది పోలీసుల మృతికి కారణమైన మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్ స్టర్ వికాస్ దూబేను పోలీసులు ఎన్‌కౌంటర్ చేశారు.

మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిన మహాకాల్ ఆలయంలో బుధవారం వికాస్ దూబేను అరెస్ట్ చేశారు. అక్కడి నుంచి ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్ తీసుకెళ్తుండగా తప్పించుకునేందుకు ప్రయత్నించిన వికాస్ దూబే పోలీసు కాల్పుల్లో మరణించినట్లు చెబుతున్నారు.

ఉత్తరప్రదేశ్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఉజ్జయిని నుంచి రోడ్డు మార్గంలో తీసుకెళ్తుండగా కాన్పూర్ సమీపంలో వాహనం బోల్తా పడిందని..  అదే అదనుగా దూబే పోలీసుల నుంచి తుపాకి లాక్కుని కాల్పులు జరిపాడని.. దీంతో పోలీసులు తిరిగి కాల్పులు జరపడంతో చనిపోయినట్లు చెప్పారు.

కాగా నిన్న బుధవారం వికాస్ దూబేను అరెస్ట్ చేయగా అంతకుముందు రోజు ఆయన అనుచరులు ఇద్దరిని అరెస్టు చేశారు.

వారిని కాన్పూర్ తెస్తున్న సమయంలోనూ బుధవారం వారిని ఎన్‌కౌంటర్ చేశారు.

కాగా యోగి ఆదిత్యనాథ్ పాలనలో యూపీలో పెద్ద సంఖ్యలో రౌడీ షీటర్లను ఎన్‌కౌంటర్ చేశారు.

వికాస్ దూబే... ఎవడీ క్రిమినల్, ఎందుకంత పాపులర్ ?