విక్రమ్ ల్యాండర్ అడ్రెస్ దొరికింది... కానీ

August 06, 2020

అసలుసిసలు బిగ్ బ్రేకింగ్ న్యూస్ గా దీన్ని చెప్పక తప్పదు. చంద్రయాన్ 2 ప్రయోగం విఫలమా? సఫలమా? అన్న క్వశ్చన్ కు ఇప్పటికిప్పుడు ఏమీ చెప్పలేమన్న మాటను నిజం చేస్తూ.. ఇస్రో శాస్త్రవేత్తలు వ్యవహరించారు. చంద్రయాన్ 2లో అత్యంత కీలకమైన విక్రమ్ ల్యాండర్ ను చంద్రుడి మీదకు దించే ప్రయత్నంలో 2.5 కిలోమీటర్ల ప్రాంతంలో.. దాని పత్తా లేకుండా పోవటం.. సమాచార లింకు మిస్ కావటం తెలిసిందే.
ఇస్రో చీఫ్ మొదలు శాస్త్రవేత్తలంతా తీవ్రనిరాశలో మునిగిసోయిన వేళ.. యావత్ భారతావని వారికి అండగా నిలవటమే కాదు.. మీ ప్రయత్నం మీరు చేశారంటూ అండగా నిలిచింది. శభాష్ అంటూ కీర్తించింది. ప్రధాని మోడీ సైతం ఉత్తేజిత వ్యాఖ్యలతో శాస్త్రవేత్తల్లో మనో నిబ్బరాన్ని పెంచారు. ఇలాంటి వేళలో.. చంద్రయాన్ 2 ప్రయోగం మీద ఆశలు వదులుకోవాల్సిందేనా? అన్న భావనకు పుల్ స్టాప్ పెడుతూ గుడ్ న్యూస్ చెప్పారు.
విక్రమ్ ల్యాండర్ ఎక్కడ ఉందన్న విషయాన్ని తాము గుర్తించినట్లు వెల్లడించారు. దీనికి సంబంధించిన ఫోటోలను సేకరించినట్లు చెప్పారు. అయితే.. విక్రమ్ ల్యాండర్ తో తమకు ఎలాంటి కమ్యూనికేషన్ లేదన్నారు. అయితే.. విక్రమ్ తో కాంట్రాక్ట్ కోసం తాము తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు.
నాలుగైదు రోజుల్లో విక్రమ్ ల్యాండర్ తో సంబంధాలు పునరుద్దరణ జరిగే అవకాశం ఉందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. చంద్రుడిపై విక్రమ్ ల్యాండర్ దిగే అద్భుత క్షణాల కోసం యావత్ దేశం ఎంతో ఉత్కంఠతో ఎదురుచూసింది. అయితే.. చివరి క్షణాల్లో ఫలితం తేలకుండానే విక్రమ్ ల్యాండర్ తో కమ్యునికేషన్ తెగిపోవటం తెలిసిందే. ఇదిలా ఉండగా.. తాజాగా ఇస్రో ఛైర్మన్ స్వయంగా ఒక ప్రకటన విడుదల చేయటం.. బిగ్ న్యూస్ చెప్పటంతో కొత్త ఆశలు చిగురించేలా చేసిందని చెప్పాలి. ప్రయత్నించే వాడికి.. ఓటమిని ఎంతకూ అంగీకరించని వాడిని విజయం వరిస్తుందంటారు. దీనికి నిదర్శనంగా చంద్రయాన్ 2 అవుతుందేమో చూడాలి. 

Read Also

541 ఉద్యోగాలు పీకేసిన జొమాటో
టీఆర్ఎస్‌కు ముందు ముందు గ‌డ్డురోజులేనా..?
యడ్డీ, మోదీ, గడ్కరీ... ఈ అమ్మాయి ప్రశ్నకు ఆన్సరేదీ?