ఇంగ్లిష్ మీడియం గొడవ - వైరల్ అవుతున్న కొన్ని అనుమానాలు

August 01, 2020
CTYPE html>
ఇంగ్లిష్ అవసరమే.  దానిని నేర్చుకోవడానిక ితెలుగును త్యాగం చేయాల్సిన అవసరం గాని, తెలుగును దూరం చేయాల్సిన అవసరం గాని లేదు. తమిళులతో సహా దక్షిణాది రాష్ట్రాల వారు తమ భాషకు, సంస్కృతికి మధ్య బంధాన్ని గట్టిగా ఉండటానికి కృషిచేస్తే... మన తెలుగు వారు అసలు భాషను పట్టించుకోరు. పైగా ఇంగ్లిష్ ను ముద్దుగా ఆరాధిస్తాను. వాస్తవానికి తెలుగు సంస్కృతి బతకాలంటే... తెలుగు భాష బతకాలి. సంస్కృతికి భాషకు అవినాభావ సంబంధం ఉంటుంది. ఏపీ ముఖ్యమంత్రి అన్ని స్కూళ్లు ఇంగ్లిష్ మీడియం చేస్తా అని తీసుకున్న ఆవేశ పూరిత నిర్ణయంపై రాష్ట్రంలో చాలా వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో ఒక నెటిజన్ లేవనెత్తిన అనుమానాలు కళ్లు తెరిపిస్తాయి. 
  
ఆంగ్లభాషామాధ్యమం పై ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతించడానికి నాకున్న కొన్ని ఇబ్బందులు :
1. పిల్లలకు పరిసరాల్లో ఆంగ్ల భాష తగినంత వినపడుతూ ఉంటే, పాఠశాలలో ప్రాథమిక స్థాయిలో విషయం అబ్బుతుంది. అందుకు పెద్ద వాళ్ళు మాట్లాడే ఆంగ్లంలో కనీసం పావు వంతు పిల్లలకు వచ్చి ఉండాలి. ఆ పరిస్థితి ఉందా? అంటే ఒకవేళ పెద్దలు వారి సంభాషణల్లో 20 వేల పదాలను వాడుతుంటే పిల్లలకు ఐదు వేల పదాలు కనీసం వచ్చి ఉండాలి. ఆ మిగతా పదాలను, క్రియా పదాలను, వాక్య నిర్మాణాన్ని మొదట ఇంట్లో, తర్వాత పాఠశాలలో పిల్లలు అనుకరిస్తూ నేర్చుకుంటారు. అలా జరగని పక్షంలో తికమక పడిపోయి ఏమీ నేర్చుకోలేరు.  
2. ప్రస్తుత ఆంగ్ల పాఠ్యపుస్తకాలు గాని, వాటిలోని విషయ వస్తువు గాని, మన సామాజిక, ఆర్థిక, భౌగోళిక పరిస్థితులకు చాలా దూరంలో రూపొందించినవి. మన రాష్ట్ర స్థాయి విద్యా పరిశోధన సంస్థ రూపొందిస్తున్న పాఠ్యాంశాల్లో ఊర్లు పేర్లు మార్చేసి ఉత్తరభారత పాఠ్యాంశాల్ని ఉంచుతున్నారు. ఇక ఆంగ్లమాధ్యమం విషయానికొస్తే, మన వద్ద పాఠ్యపుస్తకాలు రూపొందించే రచయితలు లేరు. ప్రస్తుతానికి పాఠ్యాంశాలను, సంబంధిత విద్యాసామగ్రిని మనం పాశ్చాత్య సంస్కృతి నుంచి లేదా ఉత్తర భారత సంస్కృతి నుంచి దిగుమతి చేసుకుంటాం. ఎందుకంటే ఎలాంటి ఆటంకం లేకుండా పనులు జరిగిపోతాయి, ఖర్చు ఉండదు.  ఒక చిన్న ఉదాహరణ - "Winter is here and our house pavement it is filled with snow. I made snowman. We had fun playing in the snow."ఇది అనుభవపూర్వకంగా విద్యార్థి తెలుసుకోవాల్సిన పాఠ్యాంశం. మనకు కుదురుతుందా?పాఠ్యపుస్తకాలను దిగుమతి చేసుకుంటున్నాం అంటే ముద్రణ మన వద్ద చేసినా, రచయితకు రుసుము (రాయల్టీ) మన డబ్బుతోనే కడతాము. పుస్తకానికి ఒక రూపాయి చొప్పున లెక్క వేసుకున్నా, కనీసం పది లక్షలు ఒక తెలుగు రాష్ట్రానికి సంబంధించని వ్యక్తికి ఊరికే ధారాదత్తం చేస్తున్నాం. 
3. ప్రాంతీయంగా దొరికే, కనిపించే వస్తువులకు, పాఠ్యపుస్తకాల్లో కనిపించే వస్తువులకు ఏ మాత్రం పోలిక, పొంతన ఉండవు. మనకు నీళ్లకు వాడే వస్తువులే చెంబు నుండి గంగాళం వరకు, ఆకారాన్ని, వాడుకను అనుసరించి వివిధ పేర్లు ఉన్నాయి. ఆంగ్ల పాఠ్య పుస్తకం తెరిస్తే వీటికి పేర్లు ఏవి? అంటే ఎంత ప్రయత్నించినా ప్రాథమిక విద్యలో ఆంగ్ల మాధ్యమం పిల్లవాడిని కచ్చితంగా అతని పరిసరాల నుండి దూరంగా లాక్కెళ్లిపోతుంది. అ నుండి ఱ వరకు చుట్టూ కనిపించే వస్తువుల పేర్లతో అక్షరాలు నేర్పవచ్చు. A నుండి z వరకు ఇది సాధ్యమా? పాఠ్యపుస్తకంలో చదివేది ఎదురుగా కనబడకపోతే కుమిలిపోయేది ఎవరు?   ​
 
నెటిజన్ - @tuxnani
 
నిజమే కదా... ఈయన అభిప్రాయాలు చాలా విలువైనవిలా ఉన్నాయి. గతంలో కేవలం నగరాల్లో ఉండే స్కూళ్లను మాత్రమే చంద్రబాబు ఇంగ్లిష్ మీడియం చేస్తామంటే  గోలపెట్టిన జనం  ఏం చెప్పినా సరే అంటున్నారు.