ఇపుడు రూ.10 వేల ప్రశ్న - ఏపీ ముఖ్యమంత్రి ఎవరు?

July 05, 2020

పిచ్చినాయాలా... ఎవడ్రా నీకు జర్నలిస్టు ఉద్యోగం ఇచ్చింది. ఇది పదివేల ప్రశ్ననా... అని వెంటనే ఆవేశపడకండి. ఈ ప్రశ్న అడుగుతున్నది సోషల్ మీడియా. గత కొన్ని రోజులుగా ఈ ప్రశ్న సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. రకరకాల రూపాల్లో ఈ ప్రశ్న వేసుకుని సోషల్ మీడియాలో ఆంధ్రులు క్విజ్ ప్రోగ్రాములు పెట్టుకుంటున్నారు. చెప్పుకోండి చూద్దాం, మీకిది తెలుసా? పదివేల రూపాయల ప్రశ్న... ఇలా రకరకరాల సెటైర్లు వేస్తున్నారు.

ఏపీ ఎన్నికలు ముగిసి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక... అనేక సార్లు సీఎం కేసీఆర్ ని కలిశారు. కేసీఆర్ ని కలవడం వల్ల ఈ  ప్రశ్న ఉత్పన్నం కాలేదు. కేసీఆర్ ని కలిసే సమయంలో జగన్ లో బెరుకు వినయం, కేసీఆర్ మాట, డామినేషన్ వంటి వాటి వల్ల జనం ఈ ప్రశ్న అడుగుతున్నారు. మాకు గవర్నరు, ముఖ్యమంత్రి ఇద్దరు పక్క రాష్ట్రం వాళ్లేనా అంటున్నారు. 

మరి జగన్ లో భయమో, వినయమో... కారణం ఏమైనా ప్రజలు గట్టిగా ఓటేశారు. ఆంధ్రులను అమ్మనాబూతులు తిట్టిన కేసీఆర్ పై పైచేయి సాధిస్తే జగన్ కి భవిష్యత్తు ఉంటుంది. లేకపోతే రాజకీయంగా ఘోరంగా పతనం అయ్యే ప్రమాదం ఉందని అంతటా టాక్ నడుస్తోంది. మరి పార్టీ నేతలు ఆలోచించి అధినేతను హెచ్చరిస్తే మంచిది. లేకపోతే తర్వాత కర్మ కర్మ అనుకోవాల్సి వస్తుంది.