జగన్ ఇంకో కోటి రూపాయలు రెడీ చేసుకో

August 10, 2020
CTYPE html>
మరో విషాదం జరిగింది. విశాఖపట్నం గ్యాస్ లీక్ దుర్ఘటనలో చికిత్స పొందుతున్న వెంకాయమ్మ అనే మరో మహిళ మృతిచెందింది. దీంతో వైజాగ్ గ్యాస్ లీకేజీ మృతుల సంఖ్య 13కి పెరిగింది. అన్నెంపున్నెం ఎరుగని వారు ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోతే మా మీద విచారణ వద్దంటూ సిగ్గులేకుండా ఆ కంపెనీ సుప్రీంకోర్టుకు వెళ్లింది. అక్కడ చీవాట్లు తినింది.
ఇక మృతులకు కోటి రూపాయల సాయం ప్రకటించిన ఏపీ ప్రభుత్వం మరి 13వ మృతురాలి కుటుంబానికి ఏం సాయం ఇస్తుందో చూడాలి. ఈ మెకు కూడా కోటి రూపాయలు న్యాయంగా అయితే ఇవ్వాలి. కాకపోతే చికిత్స పొంది ఇంటికెళ్లాక మళ్లీ సిరయస్ అయ్యి ఆస్పత్రికి వచ్చి మృతిచెందారావిడ. మరి ఇది గ్యాస్ మృతి కాదు అని వైసీపీ నేతలు మాయమాటలు చెబుతారా? ఆమెకు న్యాయం చేస్తారా? అన్నది ఇపుడు తెలుస్తుంది.
ఇదిలా ఉండగా కంపెనీని సీజ్ చేయమని ఆదేశాలిస్తూ ఇటీవల హైకోర్టు తీర్పు నిచ్చింది. ఎల్జీ పాలిమర్స్ తీవ్రమైన తప్పులు చేసినట్టు అర్థమవుతోందని కోర్టు అభిప్రాయపడింది. దీనిపై కూడా సుప్రీంకోర్టుకు వెళ్లిన ఎల్జీ పాలిమర్స్ ను న్యాయమూర్తులు మళ్లీ మందలించారు. ప్రస్తుతం ఎన్జీటీ, హైకోర్టు నియమించిన విచారణ కమిటీలు దర్యాప్తు చేస్తున్నాయి. త్వరలో నిజాలు బయటకు రాక తప్పదు.