ఫార్మా సిటీ మంటల్లో గంటాను తోసిన సాయిరెడ్డి 

August 03, 2020

వైజాగ్ లో ఏదో విదేశీ కంపెనీలో  ప్రమాదం జరిగితేనే దాన్నుంచి దాన్నుంచి బయటపడటానికి ఇప్పటికీ  వైకాపాకి పూర్తిగా సాధ్యం కాలేదు. ఆ కంపెనీ ముఖ్యులందరినీ అరెస్టు చేశాక చాలావరకు ప్రజలు శాంతించారు. అంతలోపే వైసీపీకి పెద్ద కష్టమొచ్చింది. ఏకంగా తన సొంత ఎంపీయే ఈసారి జగన్ సర్కారును ఇబ్బందుల్లోకి నెట్టేశారు.

ఇది కర్మకొద్దీ జరిగింది గానీ ఇంకోటెందుకు జరుగుతుందిలే అని ఎల్జీ పాలిమర్స్ వంటి ఘటనలు వైజాగ్ లో పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటాం అని మంత్రులు బీరాలు పలికారు. కట్ చేస్తే రెన్నెల్లు తిరిగేలోపు సొంత ఎంపీయే వైసీపీకి తలనొప్పి తెచ్చిపెట్టారు.

మొన్ననే వైసీపీ తరఫున రాజ్యసభకు జగన్ దగ్గరుండి పంపించిన వైసీపీ పారిశ్రామిక వేత్త ఫార్మాసిటీలో భారీ ప్రమాదం జరిగింది.

అంతకుముందు కూడా ఓ చిన్న ప్రమాదం జరిగింది. వరుస ప్రమాదాలతో వైజాగ్ ప్రజలు విసిగిపోయారు.

జగన్ సర్కారు పై నమ్మకం కోల్పోయారు. వైజాగ్ లో తమ ప్రాణాలు గాల్లో దీపాలే అని బెంగపెట్టుకున్నారు.

వైసీపీ నేతలు కనిపిస్తే కొట్టాలన్నంత కోపంగా ఉన్నారు. ఎట్టారా దేవుడా దీన్ని కవర్ చేసుకునేది అని పార్టీ అధినేత, ముఖ్యమంత్రి జగన్ తలమునకలు అవుతుంటే... నేనున్నాను అంటూ విజయసాయిరెడ్డి జగన్ కు అండగా నిలిచారు.

వైఎస్సార్సీపీ పార్టీ నేతలకు తమ తప్పులను కప్పిపుచ్చుకోవడంలో ప్రత్యేక లక్షణం ఉంది. 

ఆ నైపుణ్యంతో గంటాను వాడదాం అంటూ గంట మోగించారు.

వైజాగ్ ప్రమాదం నుంచి ప్రజల దృష్టిని మరలించడానికి గంటా కుంభకోణం అంటూ సోషల్ మీడియాలో చర్చ మొదలుపెట్టారు.

12 కోట్ల రూపాయల సైకిల్స్ నిషేధించిన కంపెనీ నుంచి కొని 5 కోట్లు నొక్కేశారంటూ సాయిరెడ్డి, తన అనుచర గణం సోషల్ మీడియాలో చెలరేగిపోయారు.

ఇక్కడ గంటా అవినీతి చేయలేదనో, చేశారనో పాయింట్ కాదు... 13 నెలల తర్వాత వైజాగ్ కు చెందిన గంటా వెంటనే తెరపైకి రావడానికి కారణం అయోధ్యరామిరెడ్డి.

కొత్తగా ఎన్నికైన రెడ్డి గారి కంపెనీ సృష్టించిన విలయం నుంచి వైకాపాను కాపాడటానికి ఫార్మా సిటీ చర్చను పక్కకు తొక్కేయడానికి వైకాపా వ్యూహాత్మకంగా గంటాను వాడుకుంటోంది.

వైకాపా మద్దతు దారులు పెద్ద ఎత్తున గంటాపై పోస్టులు పెడుతున్నారు. సడెన్ గా ఇది వెలుగులోకి రావడానికి కారణం అయోధ్యరామిరెడ్డి గారిని దాచేయడమే ఉద్దేశం.

అందుకే ఫార్మా మంటల చర్చను కిందకుతోసేయడానికి గంటాను ఆ మంటలపైన పెట్టారు అదన్నమాట వ్యూహం. అదిరిపోయిందిగా !