అమెరికా సంద‌ర్శ‌కుల్లో పెరుగుతున్న బీమా కొనుగోలు ఆవ‌శ్య‌క‌త‌

August 06, 2020

అవ‌కాశాల స్వ‌ర్గ‌దామంగా పేరొందిన అమెరికాకు విచ్చేసే ప్ర‌యాణికుల్లో బీమా కొనుగోలు ఆవ‌శ్య‌క‌త పెరుగుతోంది. 2018లో అమెరికాకు 1.4 మిలియ‌న్ల మంది భార‌తీయులు ప్ర‌యాణించారు. 2017తో పోలిస్తే ఇది 7% ఎక్కువ‌. సిలికాన్ వ్యాలీ కేంద్రంగా సేవ‌లు అందిస్తున్న బీమా కంపెనీ విజిట‌ర్స్‌క‌వ‌రేజ్ ఇదే స‌మ‌యంలో 172 % వృద్ధిని న‌మోదు చేసుకుంది. భార‌తీయులు బీమా పాల‌సీల కోసం, ఆయా కంపెనీలు అందిస్తున్న సేవ‌ల మ‌ధ్య వ్య‌త్యాసం కోసం క్షుణ్ణంగా అన్వేషిస్తున్నార‌ని తేలింది. ఈ అధ్య‌య‌నం వ‌ల్ల తాత్కాలిక స‌మ‌యం కోసం బీమా పాల‌సీలు తీసుకోవ‌డంతో పాటుగా దీర్ఘ‌కాలిక వీసాలు, విద్యార్థి వీసాలు, విజిటింగ్ పేరెంట్స్ వీసాలు ఇమిగ్రెంట్ ట్రావెల్ మెడిక‌ల్ ఇన్సురెన్స్ కోసం సైతం అన్వేషిస్తున్నారు. విజిట‌ర్స్ క‌వ‌రేజ్ యొక్క అతిపెద్ద గ్లోబ‌ల్ మార్కెట్‌గా భార‌త‌దేశం నిలుస్తోంది.

సార్వ‌జ‌నీన బీమా స‌దుపాయాన్ని అమెరికా క‌ల్పించదు. అమెరికాకు విచ్చేసే వారు బీమా క‌లిగి ఉండ‌కుండా అనారోగ్యం పాలైతే చికిత్స కోసం పెద్ద మొత్తం ఖ‌ర్చుచేయాల్సి వ‌స్తుంది. భారీయ క‌రెన్సీలో దాదాపు 6.9 మిలియ‌న్ల మొత్తం చెల్లించే ప‌రిస్థితి వ‌స్తుంది. ప్ర‌పంచంలోనే అత్యంత ఖ‌రీదైన వైద్య‌సేవ‌ల‌కు చిరునామాగా ఉన్న అమెరికాలో బీమా స‌దుపాయం లేక‌పోతే మిగిలేది ఆందోళ‌నే.

ఈ సంద‌ర్భంగా విజిట‌ర్స్‌క‌వ‌రేజ్ సీఈఓ మ‌రియు వ్య‌వ‌స్థాప‌కులు రాజీవ్ శ్రీ‌వాత్స‌వ మాట్లాడుతూ, ``అమెరికాను సంద‌ర్శించే ప‌ర్యాట‌కులు ధ‌ర పొదుపు చేయ‌డం, క‌వరేజ్ అడ్వాంటేజ్‌లు మ‌రియు క‌న్వీయెన్స్ వంటి వాటికి అమెరికా కేంద్రంగా ఉన్న సంస్థ‌ల నుంచి కొనుగోలు చేస్తున్నారు`` అని పేర్కొన్నారు. అమెరికాకు విచ్చేస్తున్న వారిలో అమెరికా కేంద్రంగా ఉండి సేవ‌లు అందిస్తున్న కంపెనీల బీమా సేవ‌ల‌ను కొనుగోలు చేస్తున్నారు. బీమా పాల‌సీల‌లో అనేక ప్ర‌త్యేక‌త‌లు ఉండ‌టం, క్లెయింల విష‌యంలో సుల‌భ‌మైన విధానాలు పాటించ‌డం, ల‌గేజ్ కోల్పోయిన సంద‌ర్బంలో, విమానం ఆల‌స్యం, ఇత‌ర ప్ర‌యాణ సంబంధిత స‌మ‌స్య‌ల విష‌యంలో అందిస్తున్న మెరుగైన సేవ‌ల వ‌ల్ల ఈ మేర‌కు మొగ్గు చూపుతున్నార‌ని వివ‌రించారు.

RELATED ARTICLES

  • No related artciles found