వివేకా కేసులో సూపర్ ట్విస్ట్

February 21, 2020

ఇదొక విచిత్రమైన పరిస్థితి. ఎన్నికల ముందు దేని కోసం అయితే జగన్ డిమాండ్ చేశారో, దానిని ఇపుడు నెరవేర్చాలని టీడీపీ లీడరు కోర్టుకు వెళ్లారు. జగన్ బాబాయి వివేకానందరెడ్డి హత్య కేసును విచారణలో ఆలస్యం జరుగుతోందని, ఏపీ ప్రభుత్వంపై నమ్మకం కోల్పోయామని... తెలుగుదేశం నేత బీటెక్ రవి కోర్టుకు వెళ్లారు. ఈ హత్య కేసును సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేశారు. బీటెక్ రవి కూడా ఈ కేసులో విచారణ ఎదుర్కొంటున్నారు. పోలీసులు ఆయనను ప్రశ్నించారు.

బీటెక్ రవి.. దీని గురించి కూడా ప్రస్తావించారు. కేసుకు సంబంధం లేని వారందరినీ ప్రశ్నిస్తూ కాలయాపన చేస్తున్నారని... కేసును వెంటనే సీబీఐకి అప్పగించి అసలు నిందితులను పట్టుకోవాలని బీటెక్ రవి డిమాండ్ చేశారు. ఈ కేసులో నేను దోషిగా తేలితే ఏ శిక్ష కయినా సిద్ధం అన్నారు. ఈ పిటిషనుతో మా పార్టీక ిసంబంధం లేదు. ఇది నా వ్యక్తిగత పిటిషను. అమాయకులు కేసులకు బలవకూడదు. ఇందులో కోర్టు జోక్యం చేసుకోవాలని కోరారు. 

హతుడి కూతురు సునీత ఈ కేసులో ఎందుకు మౌనంగా ఉన్నారని రవి ప్రశ్నించారు. వివేకాకు బయటి శత్రువులు ఎవరూ లేరని... దీని వెనుక శత్రువు ఎవరో కనిపెట్టాలని రవి విమాండ్ చేశారు.