జగన్ మరిచిపోయినా లోకేష్ మరిచిపోడుగా !

August 13, 2020

విశాఖను ఏపీకి రాజధాని చేస్తానని మానవ తప్పిద విపత్తులకు రాజధాని మార్చారని తెలుగుదేశం ప్రధాన కార్యదర్శి లోకేష్ జగన్ సర్కారుకు విమర్శల దండయాత్ర చేశారు. ఎల్జీ పాలిమర్స్ దుర్ఘటన జరిగినపుడు ముఖ్యమంత్రి, మంత్రులు ఏం చెప్పారో గుర్తుతెచ్చుకోవాలని అన్నారు. అనుకోని దుర్ఘటన జరిగింది... ఇకపై ప్రమాదలు జరగవు అని ప్రభుత్వం, మంత్రులు ప్రకటనలు చేశారన్న విషయాన్ని ఈ సందర్భంగా లోకేష్ గుర్తు చేశారు. 

అప్పుడు తనిఖీల పేరిట హడావుడి చేశారని... మరి తనిఖీలు చేసిన తర్వాత ఇలాగేనా ఫలితం ఉండేది, విశాఖపట్నం ప్రజలతో ఆడుకునే అవకాశం మీకు ఎవరిచ్చారు అంటూ లోకేష్ ప్రశ్నించారు. ఎల్జీ పాలిమర్స్ ప్రమాదం ప్రపంచాన్ని విస్మయపరిచింది. అది పూర్తిగా నిర్లక్ష్యంతో జరిగిన ప్రమాదమని ప్రభుత్వ దర్యాప్తులోనే తేలింది. మేము ముందు నుంచి అదే చెబితే అనేక సార్లు ఎదురుదాడి చేసి చివరకు అరెస్టు చేశారు. ఆ తర్వాత ప్రభుత్వం మారలేదు అనడానికి తాజా ప్రమాదం మరో నిదర్శనం అన్నారు.  రాంకీ ఎస్ఈజెడ్ లో 15 రోజుల వ్యవధిలోనే 2 ప్రమాదాలు జరిగాయి. అపుడు సాయినార్ కెమికల్స్, ఇప్పుడు జరిగిన రాంకీ ఫార్మాసిటీ ప్రమాదాలకు ప్రభుత్వం ఏం సమాధానం చెబుతుందని నారా లోకేష్ నిలదీశారు.

ఇపుడు అయినా ప్రభుత్వం అబద్ధాలు మాని నిజంగా ఆయా పరిశ్రమల్లో భద్రతా ప్రమాణాలు తనిఖీ చేయాలని డిమాండ్ చేశారు. పబ్లిసిటీ కంటే ప్రజల ప్రాణాల మీద కాస్త దృష్టి పెడితే మంచిదని... మాట వినకపోతే ఓటు దెబ్బలు తప్పవన్నారు.

అంతేగాకుండా... ఈ ఘటన పై సమగ్ర దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు. ఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని లోకేష్ డిమాండ్ చేశారు. 

మరి మంత్రులు ఏదో ఫ్లో లో ఆ రోజు ఇక పై ప్రమాదాలు జరగవు అనేసినట్టున్నారు. కంపెనీలే ఈ ప్రమాదంతో అప్రమత్తమై జాగ్రత్తలు తీసుకుంటాయని భ్రమపడినట్టున్నారు. కానీ కంపెనీల్లో పోయే ప్రాణాలు కార్మికులవే కాబట్టి యాజమాన్యాలకు అంత ఈజీగా భద్రతా ప్రమాణాలపై చురుకుముట్టదు. ప్రభుత్వం బడితె  చేతబడితేనే సమస్యకు పరిష్కారం. అయితే...  ఈ ప్రమాదాలు జరిగిన రెండు కంపెనీలలో పరోక్షంగా రెడ్లకు ఏదో రకంగా సంబంధం ఉన్నవి కావడం యాదృచ్ఛికం అనుకుందామా?

Read Also

కియారా తేనె పూసిన దేహం
KTR : కల్వకుంట్ల జర్నలిజం స్కూలు ఏమైనా పెట్టారా?
జగన్ కోసమా?... ముద్రగడ అస్త్ర సన్యాసం