కోటి నీకే ఇస్తాం... సర్కారుపై ఉమ్మేస్తున్నారు!

June 02, 2020

చేయని తప్పునకు చచ్చిపోయిన వారికి కోటి రూపాయలతో న్యాయం చేస్తానంటారు ఏపీ ముఖ్యమంత్రి... తప్పు చేయకుండా మరణించినవాడు స్వర్గానికే పోయుంటాడు... కానీ అసలు ఆ వాయువు పీల్చి బతికున్న ప్రతి ఒక్కరు నేల మీద నరకం చూస్తున్నారు. సుమారు 3 కిలోమీటర్ల మేర విస్తరించిన ప్రాంతంలో బాధితులు 20 వేలకుపైగా ఉన్నారు.

వేలాది మంది ఆ గాలిని పీల్చి తమ ఆరోగ్యం ఏమైపోతుందో తెలియని ఆందోళనలో ఉన్నారు. తీవ్రమైన ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందో అన్న భయంతో చచ్చి బతుకుతున్నారు. మనిషిని భయమే సగం చంపుతుంది. పరిస్థితి అలాగే ఉందక్కడ.

అంత సులువుగా వదిలిపోని స్కూటరుకు వేసిన రంగు గ్యాస్ దెబ్బకు పలకల్లా లేచిపోయింది, మనకంటే బలమైన ప్రకృతి మాడిమసైపోయింది. మరి మనిషిదేశాన్ని లోపల ఈ వాయువు ఎంత తినేసి ఉంటుంది. ఇంత దారుణం జరిగితే... నిర్లక్ష్యం చేసిన కంపెనీ మీద చర్యలు ఉండవా?

చచ్చినవాళ్లు తిరిగొస్తారా? అని సర్దుకోవాలా? తప్పు చేసిన వాడికి శిక్ష పడొద్దా? జనావాసాల్లో నడుపుతున్న కంపెనీని నివాసాలకు దూరంగా తరలించవద్దా? ఎందుకింకా ప్రభుత్వానికి అలసత్వం... ఎందుకు బలహీనమైన కేసులు పెడుతుంది. ఎందుకు కంపెనీని కాపాడే ప్రయత్నాలు చేస్తోంది? 

న్యాయం చేయలేని నాయకుడు మాకెందుకు? కోటి రూపాయలు మేమే ఇస్తాం మా బిడ్డల, బంధువుల ప్రాణాలు తిరిగిస్తావా సీఎం గారు అని అడిగిన వారికి సమాధానం చెప్పడానికి ఏమైనా ఉందా ప్రభుత్వం వద్ద? 

కనీసం ప్రాణాలు తీసిన కంపెనీని అక్కడి నుంచి తరలించలేరా? ప్రజల కోసమా ప్రభుత్వాలు నడిపేది... కంపెనీల కోసమా? ఇంతకంటే హేయం ఏమైనా ఉంటుందా? ముఖ్యమంత్రిగారు అని జనం నిలదీస్తున్నారు. కానీ హైకోర్టు నుంచి అంతర్జాతీయ సంస్థల వరకు అందరూ సంస్థపై కోప్పడుతున్నారు.. మన ముఖ్యమంత్రి తప్ప.  Image -: CLEANED :-