Visakhapatnam : స్టిరీన్ గ్యాస్ పై వైద్యులు ఏం చెప్పారు?

June 05, 2020

విశాఖపట్నంలో రిలీజైన స్టిరీన్ గ్యాస్ చాలా ప్రమాదకరమైనది. ఇది మనం పీల్చే ఆక్సిజన్ వాయువును కలుషితం చేస్తుంది. దీనివల్ల మనుషులకే కాకుండా  ప్రతిప్రాణికి నష్టమే. అందుకే ఎక్కువ రోగనిరోధక శక్తి కలిగి ఉన్న కుక్కలు, ఆవులు కూడా దీని దాటికి మృతిచెందాయి. ఇక స్టిరీన్ గ్యాస్ (పీవీసీ గ్యాస్ అని కూడా అంటారు) పీల్చిన వారు ఏం చేయాలో ఆరోగ్య నిపుణులు సూచించారు. అవేమిటో తెలుసుకుంటే మన వంటింటి వైద్యం గొప్పతనం కూడా తెలుస్తుంది. 

1. నీరు తరచుగా తాగాలి. నీరు H20 అంటే నీటిలో ఆక్సిజన్ ఉండటం వల్ల కొంచెం మన దేహానికి ఆక్సిజన్ అందుతుంది.

2. మాస్కు ధరించాలి. దీనివల్ల కరోనా వైరస్ నుంచే కాదు.. వాయువు ప్రభావం కూడా ఎంతో కొంత తగ్గుతుంది.

3. కళ్ల మంటలెక్కితే చల్లటి నీటితో కడుక్కోవాలి.

4. చర్మం మంట ఎక్కితే సోపుతో కడుక్కోవాలి. అనంతరం ఒక సిట్రిజన్ టాబ్లెట్ తీసుకోవాలి.

5. వాంతులయ్యేలా అనిపిస్తే Domastal tablet వేసుకోవాలి. ఇది వాంతులను ఆపుతుంది.

6. గ్యాప్ ఇస్తూ బెల్లం కొంచెం కొంచెం తినాలి. ఇది గొంతును క్లియర్ చేస్తుంది. బాడీలో చేరిన గ్యాస్ ను న్యూట్రలైజ్ చేస్తుంది. సాధారణంగా కూడా ప్రతిరోజు ఒక 5 -10 గ్రాముల బెల్లం నేరుగా తింటే మంచిది.

7. పాలు, అరటి పండు కూడా గ్యాస్ ను శరీరంలో న్యూట్రలైజ్ చేస్తుంది.