Visakhapatnam - ప్రకృతి కూడా తట్టుకోలేకపోయింది

August 04, 2020

ప్రకృతి మనకంటే శక్తివంతమైనది, వీధి కుక్కలు, పిల్లులు మనకంటే​ ఎక్కువ రోగనిరోధక శక్తి కలిగిన జీవులు. కానీ ఈ ఎల్జీ పాలిమర్స్ నుంచి లీకైన వాయువు (గ్యాస్ లీక్) ప్రభావానికి 5 కిలోమీటర్లలో ప్రకృతి, జంతువులు విలవిల్లాడాయి. మనుషులు 8 మంది చనిపోయారు. 300 మంది ప్రమాదకరమన పరిస్థితిలో ఉన్నారు. వేలాది మందికి చర్మ సమస్యలు వచ్చాయి. 5 కిలోమీటర్ల మీర ఆక్సిజన్ కలుషితం అయిపోయింది. దీని వల్ల జరిగిన ప్రమాదం ఏంటో తెలుసుకుందాం.

  • ఈ గాలి పీల్చిన కుక్కలు, పిల్లులు వణుకుతూ నురగలు కక్కుతూ కింద పడి కొట్టుకున్నాయి.
  • మనుషులను రక్షించడానికే సమయం లేదు. ఎందుకంటే వీలైనంత త్వరగా వీరికి ఆక్సిజన్ అందిస్తేనే బతుకుతారు. అందుకే ఈ మూగ ప్రాణుల గురించి ఎవరూ పట్టించుకోవడం లేదు
  • వేలాదిగా పాడి సంపద విలవిల్లాడింది. ఆవులు, గేదెలు నురగలు కక్కి పడిపోయాయి. 
  • ఈ గ్యాస్ ప్రభావంతో విశాఖపట్నం(vishakapatnam) లోని ఎల్జీ పాలిమర్స్ (LG polymers) కంపెనీ నుంచి లీకైన వాయువుకు 3-4 కిలోమీటర్ల పరిధిలో చెట్లు పాలిపోయాయి. ఆకులు మాడిపోయాయి. రంగు మారిపోయాయి. 
  • లీకైన ఈ గ్యాస్ పేరు  'స్టిరీన్ గ్యాస్' (styrene gas) అని అధికారులు పేర్కొన్నారు. 
  • లాక్ డౌన్ కారణంగా మూసివేసిన పరిశ్రమను తిరిగి ప్రారంభించే క్రమంలో ఈ ప్రమాదం జరిగినట్లు చెబుతున్నారు.