జాతీయ చిహ్నాన్ని అవమానించిన జగన్ సర్కారు

August 08, 2020

​జగన్ ప్రభుత్వం చారిత్రక ఆనవాళ్లను తుడిపేస్తోంది. ఇప్పటికే ప్రజావేదికను కూల్చి అప్రతిష్టను మూటగట్టుకుంది. అయితే చంద్రబాబును అడ్డుపెట్టుకుని దాని నుంచి తప్పించుకుంది. కానీ ​విజయనగరం పట్టణంలో రాజుల కాలం నాటి చారిత్రక కట్టడం మూడు లాంతర్ల స్తంభాన్ని​ఈరోజు మున్సిపల్ యంత్రాంగం​ కూల్చివేసింది. మూడు ప్రధాన రహదారుల కలిసే చోట నిర్మించిన హరికేన్ లాంతర్ల స్తంభం​పై జాతీయ చిహ్నం​ అయిన​ మూడు సింహాలు ​ కొలువై ఉంటాయి.​

Image 

​వందేళ్లకు మించి చరిత్ర ఉన్న ఈ మూడు లాంతర్ల స్తంభాన్ని కూల్చడంపై ప్రజలు తీవ్రంగా అభ్యంతరం వ్యక్తంచేస్తున్నారు.  నిజంగా ఆ మూడు లాంతర్లు అభివృద్ధికి అంత అడ్డొచ్చాయా...???? నిజమే అవి చాలా చిన్నది కాకపోతే విజయనగరానికి అదే ఓ చార్మినార్ మాదిరి అది. రాత్రి సమయంలో ప్రయాణికులకు తోవ కనిపించేందుకు రాజుల కాలంలో నిర్మించిన మూడు లాంతర్ల స్తంభం అక్కడ బాగా ఫేమస్. మూడు లాంతర్ల స్తంభం ప్రాముఖ్య కారణంగా మూడు లాంతర్ల జంక్షన్ గా ప్రసిద్ధి గాంచింది. అది పట్టణానికి చిరునామాలా మారిపోయింది.
వాస్తవానికి జాతీయ చిహ్నం అయిన మూడు సింహాల గుర్తును తొలగించడానికి కొన్ని పద్ధతులు ఉంటాయి. జాగ్రత్తగా ధ్వంసం చేయకుండా తీసి పక్కన పెట్టాలి. కానీ ఏకంగా ప్రొక్లెయినర్ తో Prevention of Insults to National Honour Act, 1971 ప్రకారం ఇది జాతీయ చిహ్నాన్ని అవమానించి నేరం కిందకు వస్తుంది. ఏడాది వరకు జైలు శిక్ష వేయదగిన నేరం ఇది.
మూడు లాంతర్ల స్తంభం కూల్చివేత గురించి సామాజిక మాధ్యమాల్లో ప్రచారం కాగానే ​ప్రజల నుంచి  తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. దీంతో కూల్చివేసిన కట్టడం స్థానంలో కొత్త చిహ్నాన్ని నిర్మించేందుకు అధికారుల ప్రణాళిక రచిస్తున్నారు. తప్పు దిద్దుకునే ప్రయత్నం చేయాలా; పట్టించుకోకుండా వదిలేయాలా అనే చర్చలు జరుగుతున్నాయి.
 
అన్ని పార్టీల నేతలు ధర్నాకు దిగారు. పురావస్తు శాఖ ప్రభుత్వంపై చర్య తీసుకోవాని డిమాండ్ చేశారు. దీంతో కలెక్టరు ఈ సంఘటనపై విచారణకు ఆదేశించారు. మరి కలెక్టరుకు తెలియకుండా అంత ప్రధానమైన కూల్చివేత జరిగి ఉంటుందంటారా?