ఏపీలో బానిసత్వం ఛాయలు

June 01, 2020
CTYPE html>
ప్రజలకు, ఉద్యోగులకు భరోసాగా నిలవడం ముఖ్యమంత్రి బాధ్యత. ఇదే రాజరికంలో అయితే దయ అనే వారు. ముఖ్యమంత్రులు ఏం పథకం పెట్టినా అవి ప్రజల డబ్బుతో  సమకూర్చేవే అనే ఎరుకతో ముఖ్యమంత్రులు పనిచేయాలి. అది కనుక మరిచిపోతే ఏదో ఒక రోజు కుప్పకూలిపోక తప్పదు. ఇదేమీ రాజరికం కాదు, నార్త్ కొరియా అంతకన్నా కాదు. 
తాజాగా ఏపీలో జరిగిన ఒక సంఘటనపై జనంలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. వలంటీర్లకు కరోనాతో చనిపోతే 50 లక్షలు భీమా ప్రకటించారు ముఖ్యమంత్రి. ఇధి కరోనాతో చనిపోతే మాత్రమే ఇచ్చే తాత్కాలిక పథకం అని గుర్తుంచుకోవాలి. ఇదేం వినూత్న పథకం కాదు. ఢిల్లీలో కేజ్రీవాల్ కోటి రూపాయల భీమా ఇస్తున్నారు. అక్కడి నుంచి కాపీ కొట్టారు. 
అయితే... ఈ పథకం జగన్ దయ అన్నట్లు వైసీపీ నేతలు గోడ మీద ఒక ఫొటో పెట్టి... వలంటీర్లు బానిసల్లా జగన్ ఫొటోకు దండాలు పెట్టిస్తున్నారు. ఇది తమ ఇష్టప్రకారం కాదట. లైన్లో నిలబడి మరీ తమ భక్తిని చాటుకోవాలట. ఇంతకు మించిన అరాచకం ఏముంటుంది? నియంత కిమ్ పాలనలో నార్త్ కొరియాలో ఉన్న పరిస్థితి ఏపీలో రానుందా? ఎన్నో రాజ్యాంగ ఉల్లంఘనలు ఇప్పటికే జరిగాయి. మళ్లీ అదే పద్ధతి. స్కీములతో ప్రజలకు వల వేసి ... ఎన్ని తప్పులు చేసినా వారు తనకు మద్దతు పలికేలా చేస్తున్నారు జగన్. 2020లో ఇలాంటి సీన్ మన రాష్ట్రంలో చూడాల్సి రావడం శోచనీయం.