బాంబు పేల్చిన తెలుగు ప్రముఖ దర్శకుడు

May 31, 2020

సినిమా ఇండ‌స్ట్రీలో కొంత‌మంది ప్ర‌ముఖుల‌కు కొన్ని ఇష్టాలు ఉంటాయి. వారి ఇష్టానికి త‌గిన‌ట్లుగా జ‌ర‌గ‌దు కానీ.. తాము కోరుకోని విష‌యంలో వారు ప్ర‌ముఖులు అయిపోతుంటారు. స్వ‌ర్గీయ రామానాయుడ్నే తీసుకుంటే.. ఆయ‌న్ను సూప‌ర్ నిర్మాత‌గా ఎవ‌రూ కాద‌న‌రు. కానీ.. ఆయ‌న‌కేమో సినిమాట్లో న‌టుడిగా రాణించాల‌ని ఉండేది. ఆ కోరిక‌ను తీర్చుకోవ‌టం కోసం.. త‌న సినిమాల్లో ఏదో ఒక పాత్ర‌లో క‌నిపించేవారు.
అలాంటి తీరు చాలామంది సినీ ప్ర‌ముఖుల్లో క‌నిపిస్తూ ఉంటుంది. హీరో ఎవ‌రైనా లాంఛింగ్ ప్యాడ్ కింద ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు ఎవ‌రంటే.. చాలామంది వీవీ వినాయ‌క్ పేరు చెబుతారు. ఎన్నో బ్లాక్ బ‌స్ట‌ర్లు ఇచ్చిన ఆయ‌నకు.. న‌టుడిగా తెర మీద క‌నిపించాల‌న్న ఆస‌క్తి ఎక్కువ‌గా చెబుతారు. ఈ కార‌ణంతో త‌న సినిమాలో ఎక్క‌డో ఒక ద‌గ్గ‌ర ఏదోలా క‌నిపించే ప్ర‌య‌త్నం చేస్తుంటారు.
అలాంటి వినాయ‌క్ కు ఊహించ‌ని ఆఫ‌ర్ ఒక‌టి వ‌చ్చిన‌ట్లుగా తెలుస్తోంది. ప్ర‌ముఖ త‌మిళ ద‌ర్శ‌కుడు శంక‌ర్ ద‌గ్గ‌ర కో డైరెక్ట‌ర్ గా ప‌ని చేసిన న‌ర‌సింహారావు.. తాజాగా వినాయ‌క్ ను ప్ర‌ధాన‌పాత్ర‌తో ఒక సినిమా చేయాల‌ని ప్లాన్ చేసిన వైనం ఆస‌క్తిక‌రంగా మారింది. వినాయ‌క్ ఏజ్ కు త‌గ్గ‌ట్లుగా ఒక క‌థ రెఢీకావ‌టం.. ఆ విష‌యాన్ని వినాయ‌క్ కు చెప్ప‌గా.. ఆయ‌న ఓకే అన్న‌ట్లుగా తెలుస్తోంది.
ఆస‌క్తిక‌ర‌మైన మ‌రో సంగ‌తి ఏమంటే.. ఈ సినిమాకు నిర్మాత‌గా దిల్ రాజు ఓకే చేసిన‌ట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన మ‌రిన్ని విశేషాల్ని త్వ‌ర‌లో బ‌య‌ట‌కు వ‌స్తాయంటున్నారు. ఒక ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు.. ఒక సినిమాలో ప్ర‌ధాన‌పాత్ర పోషించే అవ‌కాశం వెతుక్కుంటూ రావ‌టం ఇటీవ‌ల కాలంలో ఎప్పుడూ జ‌రిగింది లేదు. మ‌రి.. త‌న‌కిష్ట‌మైన న‌ట‌నను వినాయ‌క్ ఎంత‌లా ప్ర‌ద‌ర్శిస్తారో ఈసినిమాతో తేలుతుంద‌ని చెప్పాలి. ఏమైనా.. ఈ సినిమా అంద‌రి నోట్లో నాన‌ట‌మే కాదు.. అంద‌రూ ఎదురుచూసే సినిమాలా మారుతుంద‌న‌టంలో సందేహం లేదనే చెప్పాలి.