​బాలకృష్ణ చేసిన పనికి ఆ దర్శకుడు ఫిదా

August 14, 2020

నందమూరి బాలకృష్ణ ఏదైనా పనిచేస్తే మనస్ఫూర్తిగా చేస్తారు, అన్యమనస్కంగా  ఏ పనీ చేయరు. అతను తన సినిమాల్లో గాని బయట గాని అనవసరంగా ఎవడి జోలికి పోడు. తనను కెలికితే ఊరుకోడు. తాను సుప్రీం అని ఫీలవుతాడు. కానీ తన నియోజకవర్గ ప్రజల విషయంలో సేవకుడిలా ఫీలవుతాడు. తండ్రి కల అయిన బసవతారకం ఆస్పత్రిని కాపాడుకుని ప్రాణాలు పోయడంలో దేవదూతలా ప్రవర్తిస్తారు. అందుకే బాలయ్యకు ప్రత్యేక అభిమానులున్నారు. అపారమైన ప్రేమను బాలయ్య సంపాదించుకున్నారు. 

తాజాగా ఇండస్ట్రీకి సంబంధించి నందమూరి బాలకృష్ణ ఒక మంచి పనిచేశారు. కరోనా నానాటికీ మరింతగా వ్యాప్తి చెందుతున్న వేళ సినిమా ఇండస్ట్రీలోని 24 విభాగాలకు చెందిన వారందరికీ బసవతారకం కాన్సర్ ఆసుపత్రి తరుపున కరోనా నిరోధానికి సంబంధించిన హోమియో పిల్స్, విటమిన్ టాబ్లెట్స్‌ పంపించారు. సడెన్ గా వాటిని అందుకున్న వారంతా ఎంతో సంతోషం వ్యక్తంచేశారు. 

బాలయ్య చేసిన పనికి దర్శకుడు వివి వినాయక్ హృద్యంగా స్పందించారు. ‘‘ముందు జాగ్రత్తగా కరోనా నిరోధానికి హోమియో పిల్స్, విటమిన్ టాబ్లెట్స్ ను బసవతారకం హాస్పిటల్ ద్వారా నందమూరి బాలకృష్ణ గారు పంపారు.నాకే కాదు ఈ మెడిసిన్ ను ఆయన 24 క్రాఫ్ట్స్ కు చెందిన అందరికీ పంపిస్తున్నారు.నన్ను గుర్తుపెట్టుకుని మరీ పంపినందుకు బాలకృష్ణ గారికి కృతజ్ఞతలు‘‘ అంటూ ఆయన నందమూరి బాలకృష్ణకు కృతజ్జతలు తెలిపారు.