వి.వీ.ఐ.పి ల వెంకన్న స్వామి

August 14, 2020

అనునిత్యం భక్తకోటి జనంతో అలరారే వెంకటేశ్వర స్వామి సన్నిధి తిరుమల. నేడు కరోనా మహమ్మారితో సామాన్య భక్తులకు స్వామి దర్శనం కరువయ్యె. కాని వి.వీ.ఐ.పి లు మాత్రం మహమ్మారి మాంద్యంలోనూ సకుటుంబ సపరివార సమేతంగా స్వామి వారి దివ్యదర్శన ప్రాప్తమయ్యె. తిరుమల తిరుపతి దేవస్థానం గడచిన నెలనాళ్ళ నుండి భక్తులకు దర్శనాలు నిలిపివేసిన విషయం విదితమే. కాని సాక్షాత్తూ టీటిడి బోర్డు ఛైర్మన్ కుటుంబ సమేతంగా స్వామి వారి దర్శనం చేసుకున్నారని అభియోగం.
పదవిలో వున్నాను కదా అని ఏది చేసినా చెల్లుతుందని అనుకుంటే ఎలా వై.వి.సుబ్బారెడ్డిగారు, ఒకవేళ మీరు చేయకపోయినా లేదా మరే కారణం చేతైనా సమర్ధించుకున్నా సామాన్య భక్తకోటి జనం నిజంగా నమ్ముతారా. పోనీ భక్తుల గురించి వదిలేద్దాం, మీరు అపారదర్శకంగా చేసుకున్న స్వామి వారి దర్శనం ఏమైనా సార్ధకమవుతుందా. సామాన్య భక్తుడు ఎన్నో వ్యయప్రయాసల కోర్చి, ఎంతో నియమ నిష్టలతో పరితపించి చిట్టచివరకు కొన్ని సెకన్లు మాత్రమే చూడదగ్గ స్వామి వారి దివ్య దర్శనాన్ని మీరు భక్తకోటి జనం లేకుండా సావధనాంగా, సౌలభ్యంగా సకుటుంబ సపరివార సమేతంగా వీవీఐపి దర్శన చేసుకంటే ఆ ఫలం మీకు దక్కుతుందని మీరనుకుంటున్నారా.
టీటీడి ఛైర్మన్ గారు మీరు మీ కుటుంబంతో దర్శనం చేసుకుంటే నిజం చెప్పండి, అబద్ధం మాత్రం ఆడకండి. ఒకవేళ మీరు అబద్ధం ఆడితే ప్రపంచానికి తెలియకపోవచ్చు కాని ఆ పరమేశ్వరుడికి మాత్రం కాదు. ఎందుకంటే ఆయన వీవీఐపి వెంకన్నసామి కాదు అఖిలాండకోటి బ్రహ్మండనాయకుడు అనాధరక్షక ఆపద్భాంధవుడు శ్రీమన్నారాయణుడు. తరువాత మీ ఇష్టం. గోవిందా గోవిందా.
ఇట్లు...మీ విషయ విమర్ళకుడు